Chanakya Niti : మనం ఎవరినైనా దగ్గరకు తీస్తే…వారిని గుడ్డిగా నమ్ముతా.ఇటువంటి వారికి ఏ విషయాన్ని అయినా చెప్పడానికి వెనకాడము. ప్రతి ఒక్క వ్యక్తి చేసే పొరపాటు ఇదే అంటున్నాడు చాణుక్యుడు. జీవితంలో అన్ని అందరికీ చెప్ప కూడదని. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని చెప్పాడు. ఇలా చేయడం వల్ల జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిందే అంటున్నాడు.
స్నేహితులు లేదా ఆత్మీయులతో చెప్పకూడని కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నీకు కష్టం వచ్చిన సమయంలో నిన్న ఆదుకునేది డబ్బే అని ఆచార్యచాణిక్య చెప్పాడు. మీతో ఎవరు లేని సమయంలో డబ్బు మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. మీరు భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును దాచుకోవాలని సూచించాడు. కాబట్టి డబ్బు గురించి ఎంత ప్రాణ స్నేహితులు కైనా చెప్పకూడదని చెప్పాడు. ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు జరుగుతాయి వాటిని ఎవరికి చెప్పవద్దని చెప్పాడు
Chanakya Niti : మీకు ఎంత దగ్గర వారైనా సరే ఈ నాలుగు సూత్రాలను పంచుకోవద్దంటున్న ఆచార్యచాణిక్య

ఇంట్లో గొడవల గురించి బంధుమిత్రులకు కానీ, స్నేహితుడు లేదా స్నేహితురాలు చెప్పకూడదు. ఎవరైనా మీ పట్ల చెడుగా ప్రవర్తించినట్లయితే అవమానాన్ని మీ మనసులోనే దాచుకోండి. ఈ విషయాన్ని ఎవరితో చర్చించుకోవద్దు. దీనివల్ల రోజు మిమ్మలని ఓదారుస్తున్న వ్యక్తి అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని అవమానిస్తాడు. కాబట్టి విషయాన్ని మీ మనసులోనే దాచుకోండి.మీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎవరితోనీ పంచుకోకండి ఈ అవకాశాన్ని చూసినా వ్యక్తి మీ వ్యక్తిగవిషయాలను తెలుసుకుంటాడు. ఆ తరువాత ఇటువంటి విషయాల గురించి మిమ్మల్ని ఎగతాళి చేస్తాడు. ఎవరికైనా మీ బాధ గురించి చెపితే నీ మనసులో ఉన్న బాధ తగ్గదు. ఆ తర్వాత ఈ బాధను భరించవలసి ఉంటుంది.