Health Benefits : వర్షాకాలంలో లభించే ఈ చిలకడ దుంపలు మీ శరీరానికి ఎంతో మేలు…..

Health Benefits  : మీ చిలకడదుంపలు వర్షాకాలంలో పుష్కలంగా లభిస్తాయి. ఈ దుంపలు ఎంతో రుచికరమైనవి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ వీటిని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపరు. వీటి పైన మట్టి నిండి ఉంటుంది ఆ మట్టిని తొలగించి, కడుక్కొని ఉడకబెట్టుకొని తినడం.కాస్త చిరాకుగా ఉండడంతో.. వీటిపై పెద్దగా ఆసక్తి చూపరు. ఈ చిలకడదుంపలు తక్కువ ధరలకే లభిస్తాయి కానీ.. ఇవి తినడం వల్ల ప్రయోజనాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.

ఇవి తీపి, పిండి పదార్థాలతో ఉంటాయి. ఇది ఆరెంజ్, వైట్, పర్పుల్ ఇలా వివిధ రకాల రంగులను కలిగి ఉండి మన శరీరానికి చాలా రకాల పోషకాలని అందజేస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మట్టిలోనే పెరుగుతాయి కాని.. వీటినిండా పోషకాలే. కార్బోహైడ్రేట్స్ ,ప్రోటీన్స్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఏ సీ విటమిన్ b6, పొటాషియం కలిగి ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తాయి.

Health Benefits : వర్షాకాలంలో లభించే ఈ చిలకడ దుంపలు మీ శరీరానికి ఎంతో మేలు…..

health benefits of eating sweet potato
health benefits of eating sweet potato

ఇవి మన పొట్టలోనే పేగులు, ఆహార నాలాలను శుభ్రం చేస్తాయి. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియా ఈ దుంపలకు బలాన్ని ఇచ్చి పొట్టలోకి వ్యాధులు రాకుండా వాటితో రక్షణ కల్పిస్తాయి. చిలకడదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి కణాలను తరిమేస్తాయి. వీలైనంతవరకు చిలకడ దుంపలను తొక్కతోనే తినాలి. ఎందుకంటే తొక్కలో కూడా క్యాన్సర్ కణాలను అడ్డుకునే శక్తి ఉంటుందని గుర్తించారు.
ఈ దుంపల లోబీటా కెరోటిన్ ఉంటుంది. కంటిలో కాంతిని గ్రహించే శక్తి పెంచుతుంది.

దీనివల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. ఆరెంజ్ కలర్ లో ఉన్న ఈ దుంపలను తినడం వల్ల కంటికి చాలా మంచిది. ప్రస్తుత కాలంలో పనిలో టెన్షన్లలతో బుర్ర హీట్ ఎక్కుతుంది. అటువంటి వారు వీటిని తప్పకుండా తీసుకోవాలి. ఇవి బ్రెయిన్ లో హీట్ ని తగ్గించి కూల్ చేస్తుంది. అలాగే మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఈ రోజుల్లో మనకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఈ దుంపల లో ఉంటుంది. వీటిలో విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిని కొందరు పచ్చివిగానే తింటారు. అదొక టేస్ట్ గా ఉంటుంది. కానీ పచ్చివి తినడం కన్నా ఉడికించుకొని తింటే త్వరగా జీర్ణం అవుతాయి.
health benefits of eating sweet potato