Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్ లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్ గాను అనేక ప్రోగ్రాములు చేస్తూ హడావుడిగా ఉంటున్నాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడు కాఫీ విత్ కరణ్ షోలో తాను చేసి ప్రతి కామెంట్ వైరల్ గా మారాయి. ఈ షోలో కరణ్ జోహార్ సెలబ్రిటీలను తన క్వషన్స్ తో కాంట్రవర్సీలుగా మారుస్తూ వారిని ఉప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. తాజాగా జరిగిన విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే తో ఇంటర్వ్యూ ఇప్పుడు ఓటిటిలో ప్రసారమవుతుంది.
ఈ షోలో విజయ్ దేవరకొండ అనేక రకాల అభ్యంతరకర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టాడు. ఈ ప్రశ్నలన్నింటికీ మన విజయ్ దేవరకొండ చాలా చాలాకీగా సమాధానం ఇస్తూ చురుకుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అన్న మాటకి సమాధానంగా నేను పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నప్పుడు దీనికి ఆన్సర్ చేస్తానని గట్టిగా సమాధానం చెప్పాడు. నేను ఇప్పటివరకు ఎవరు మనోభావాలు కించపరచాలనుకోవట్లేదు. నన్ను హీరోగా చాలామంది ప్రేమిస్తున్నారని.
Vijay Devarakonda : ఆరోజే నా ప్రేమ గురించి చెప్తా అంటున్న విజయ్ దేవరకొండ….

వారి మనసులో నాకు ప్రత్యేక స్థానం ఉందని, వారి ఫోన్లో నా ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకుంటారని, అంతలా తనను తమ అభిమాన హీరోగా ఆరాధిస్తున్నారని వారికి నా ప్రేమ గురించి చెప్పి వారి మనసు నిన్ను ముక్కలు చేయలేనని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పాడు. ఇదిలా ఉండగా రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చేసిన గీతాగోవిందం మరియు డియర్ కామ్రేడ్ సినిమా దగ్గర నుంచి వీరిద్దరూ ప్రేమికులని అంటుండగా అటు రష్మిక మరియు విజయ్ దేవరకొండ తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని వారి మధ్య అటువంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ చాలామంది బలంగా నమ్ముతున్నారు.