Pradeep Machiraju : నెంబర్ 1 యాంకర్ గా ఉన్న ప్రదీప్ మాచిరాజు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు(బయోగ్రఫీ)……

Pradeep Machiraju : ప్రదీప్ పూర్తి పేరు ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ 1985 అక్టోబర్ 23 న పాండురంగా, భావన దంపతులకు అమలాపురంలో జన్మించాడు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రదీప్ కి ఒక అక్క కూడా ఉంది. ప్రదీప్ స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్ లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు, చిన్నప్పటి నుంచి స్టేజ్ షోలు ఇవ్వడం అలవాటు ఉండేది. ప్రదీప్ తన బీటెక పూర్తి అయిపోయాక, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ప్రమోటర్గా చేరాడు. అక్కడ ప్రదీప్ జాబు ఏంటంటే, తను ఒక పోస్టల్ పట్టుకొని రోడ్డుపై నిల్చోవాలి.

అందుకుగాను తనకి నూట యాభై రూపాయలు రోజూకు ఇచ్చేవారు.ఇదే ప్రదీప్ మొదటి జాబు. అక్కడ పనిచేసే సమయంలోనే ఒక రోజు ఈవెంట్ పనిమీద రేడియో మిర్చి ఆఫీస్ కి వెళతాడు. ప్రదీప్ వాయిస్ విన్న రేడియో మిర్చి వాళ్లు ప్రదీప్ కి రేడియో జాకీ గా అవకాశం ఇచ్చారు, తనకి రేడియో జాకీ గా అవకాశం ఇవ్వడానికి తను పదమూడు రౌండ్లు క్వాలిఫై అవ్వాల్సి వచ్చింది. ఇలా రెండు సంవత్సరాలు ఆర్జేగా అక్కడే పని చేసిన తరువాత, లోకల్ టీవీ లో డ్యాన్స్ షో చేసేవాడు. దానిని చూసిన జీ తెలుగు వాళ్లు ప్రదీప్ కి గడసరి అత్త సొగసరి కోడలు అనే షో కి యాంకర్ గా చేసే అవకాశం ఇస్తారు.

Pradeep Machiraju : నెంబర్ 1 యాంకర్ గా ఉన్న ప్రదీప్ మాచిరాజు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

Telugu television no1 anchor pradeep machiraju biography
Telugu television no1 anchor pradeep machiraju biography

ఆ షో ద్వారానే ప్రదీప్ తెలుగు ప్రజలకు ఒక యాంకర్ గా పరిచయం అయ్యాడు. ఆ షో హిట్ అవ్వడంతో ప్రదీప్ కి మంచి పేరు వచ్చింది. ఆ షో కి గాను నంది అవార్డ్ ఫర్ ద బెస్ట్ యాంకర్ అనే అవార్డును 2010 లో గెలుచుకున్నాడు. ఇక అప్పటి నుంచి చాలా టీవీ షోలకు, ఈవెంట్లకు ఒక సక్సెస్ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్నాడు. అదే కాకుండా కొంచెం టచ్లో ఉంటే చెప్తా అనే టీవీ షోతో ప్రొడ్యూసర్ గా కూడా మారాడు. అదే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ లవ్, వరుడు, జులాయి, అత్తారింటికి దారేది ఇలా ఎన్నో హిట్ సినిమాలలో కూడా యాక్ట్ చేశాడు ప్రదీప్. తన సంపదలో వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని పేదలకు విరాళంగా ఇస్తూ ఉంటాడు.

తను ఎన్నో షోలకు యాంకరింగ్ చేసిన మానవతా విలువలు కలిగిన లక్ష్మీదేవి తలుపుతట్టింది అనే షో అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాడు. డీ జోడీ, డ్రామా జూనియర్స్, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్, ఎక్స్ప్రెస్ రాజా, నేనే నెంబర్ వన్, అదుర్స్, రారండోయ్ వేడుక చేద్దాం, గడసరి అత్త సొగసరి కోడలు, కామెడీ క్లబ్, ప్రదీప్ దర్బార్ కొంచెం టచ్లో ఉంటే చెప్తా, లక్ష్మీదేవి తలుపుతట్టింది, ఇలా ఎన్నో షోలకు యాంకర్ గా చేశాడు ప్రదీప్.

మన అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ప్రదీప్ పేరు మీద కొన్ని ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి, అమాయకుల దగ్గర నుంచి డబ్బులు లాగడం జరిగింది ఆ విషయం తెలిసిన తర్వాత, ప్రదీప్ చాలా బాధపడ్డాడు. నిజానికి ప్రదీప్ కి ఫేస్బుక్ లో అకౌంట్ లేదు, కేవలం తన పేరు మీద ఒక పేజీ మాత్రమే ఉంది. ప్రదీప్ కి ఒక అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. కావలి అంటే తన అభిమానులు అక్కడ తనని ఫాలో అవ్వొచ్చు అని చెప్పారు.

ఇలా టీవీ షోస్, ఈవెంట్స్ మాత్రమే, కాకుండా మూవీస్ తో చాలా అలరిస్తున్నాడు. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా పరిచయం అయ్యాడు ప్రదీప్. ఇలా వరుస అవకాశాలతో, సక్సెస్ తో దూసుకుపోతున్న ప్రదీప్ గురించి అందరూ అడిగే ప్రశ్న ప్రదీప్ పెళ్లి. తన అభిమానులు ఎందరో ప్రదీప్ పెళ్లి గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మంచి స్థానంలో ఉండాలి, ఎన్నో అవకాశాలు రావాలి అని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.