Naga Chaitanya : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న జంట అక్కినేని నాగచైతన్య ,సమంత వీరిద్దరూ కొన్ని అనువార్య కారణాల వలన విడాకుల పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంపై వీరిఅభిమానులు ఎంతో బాధను వ్యక్తం చేశారు. వీరు విడాకులు జరిగి సుమారు కొన్ని నెలలు కావస్తున్న ఇంకా వీరిద్దరి విడాకులపై ఏదో ఒక రూపంలో విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అయితే వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు. దానికి గల కారణాలు ఏంటో ఇప్పటివరకు అసలు విషయం ఏంటి అనేది తెలియ జేయలేదు. పలుసార్లు సామ్ తమ విడాకుల గురించి స్పందించిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో కాఫీ విత్ కరణ్ షోలో సమంత వారి విడాకులపై కొన్ని మాటలు మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య ఎన్నో ఘర్షణలు జరిగాయి. అదేవిధంగా ఎన్నో అనుమానాలు కూడా చోటు చేసుకున్నాయి. మేమిద్దరం ఆశా మాసిగా ఏం విడాకులు తీసుకోలేదు.. అని చెప్పింది. సమంత ఆ షోలో చెప్పిన కొన్ని వాక్యాలు అభిమానులు ను ఆశ్చర్యపరిచాయి. నాగచైతన్య మాత్రం ఎటువంటి సందర్భంలోనైనా కూడా తను సమంత గురించి గానీ, తన తన పేరు గాని, వారిద్దరి విడాకుల గురించి గానీ, ఎప్పుడూ కూడా చర్చించలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా నాగచైతన్య కూడా వారిద్దరి విడాకుల వ్యవహారంపై ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను బయటపెట్టేశారు.

తన జీవితంలో వచ్చిన విజయాల కంటే వాటిని పక్కన పెట్టి నాలో లోపాలు ఉన్నట్లు పదేపదే సమాచారాలు రావడం నాకు చాలా బాధాకరంగా ఉన్నది. నేను సమంత విడాకులు తీసుకున్నప్పుడు, ఈ విషయాన్ని అయితే చెప్పాలి అనుకున్నాము. అదే విషయాన్ని మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇంతకంటే ఎక్కువ నేను ఏమి చెప్పాలి అనుకోలేదు. అని నాగచైతన్య క్లియర్ గా చెప్పేశాడు.
మా ఫ్యామిలీలో ఏం జరిగిందో ఎలాంటి సంఘటన చోటు చేసుకుందో. అభిమానులకి, బంధుమిత్రులకి అందరికీ తెలిసిన విషయమే. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వినిపిస్తున్నాయి. రోజుకో పుకార్లు వినిపిస్తున్నాయి. వాటిపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. కానీ ఫ్యూచర్లో వీటన్నింటికీ ఒక మంచి పరిష్కారం అంటూ ఉంటుంది. అని తన మనసులో మాట బయటికి చెప్పేసాడు.