Ramya krishna : హీరోయిన్ రమ్యకృష్ణ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రభాస్ నటించిన ‘ బాహుబలి ‘ సినిమాలో శివగామి అనే కీలకపాత్రను పోషించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమె పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించారు. పెద్ద పెద్ద యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆదరాభిమానాలు పొందుతుంది. అయితే సినిమాల్లో మంచి పొజిషన్లో ఉండగానే డైరెక్టర్ కృష్ణ వంశీ ను రమ్యకృష్ణ వివాహం చేసుకుంది. సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ ఎవరికి ఇంతగా రాలేదు. ఎన్నో ఏళ్ల కృషి ఫలితమేనని పలు సందర్భాలలో, ఇంటర్వ్యూలలో చెబుతుంటారు.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద భూతం. ఇప్పటి హీరోయిన్లే కాకుండా గతంలో పెద్ద హీరోయిన్లుగా చెలామణి అయిన వారు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ. అయితే వారందరినీ ఎదుర్కొని నటనలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ‘ నరసింహ ‘ సినిమాలో ఆమె చేసిన నటనకు సూపర్ స్టార్ రజినీకాంత్ గారు మెచ్చుకున్నారు అంటే ఆమె ఎలాంటి నటి అనేది అందరికీ అర్థమై ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో ఈమె కూడా చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది. అవకాశాల పేరిట ఆమెతో చాలామంది అసభ్యంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు.
Ramya krishna : రమ్యకృష్ణతో అసభ్యంగా మాట్లాడిన డైరెక్టర్… దారుణంగా చనిపోయాడట…

ఓం స్టార్ డైరెక్టర్ ఆమెకు శృంగార వీడియోలు చూయించి ఇలా చేయొచ్చు కదా అని బలవంతం చేసేవాడట. నువ్వు ఇలా చేస్తే నీకు డబ్బులు బాగా వస్తాయి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి నువ్వు బాగా పనికి వస్తావు అంటూ అసభ్యంగా మాట్లాడాడట .అయితే ఆ డైరెక్టర్ అప్పట్లో పెద్ద స్థాయిలో ఉండటంతో అతని గురించి ఎవరికి చెప్పినా నమ్మలేదంట. కానీ కొన్నాళ్ల తర్వాత అతను దారుణంగా చనిపోయాడని రమ్యకృష్ణ పేర్కొన్నారు. చివరి రోజుల్లో నా అనేవాళ్ళు దూరం పెట్టి తిండి కూడా దొరక్క అనాథ గా నరకం అనుభవించి చనిపోయారని రమ్యకృష్ణ తన జీవితంలో జరిగిన దుర్ఘటన గుర్తు చేసుకున్నారు.