Bimbisara Movie Review : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. అయన కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమాగా తెరకెక్కిన బింబిసార 500 సంవత్సరం కాలం క్రితం సినిమా.. టైమ్ ట్రావెల్ పాయింట్ తో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరెకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మించింది. దర్శకుడు మల్లిడి వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా చూద్దాం.
కథ:
క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడుగా నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో గొప్పగా నటించాడు. ఇందులో బింబిసార కాల ప్రవాహంలో కలిసిపోయి డిజిటల్ యుగంలో పుడతాడు. అప్పుడు అతను గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన కాలం నుంచి కలియుగంలోకి వచ్చి తను సంపాదించిన నిధిని కాపాడుంటాడు. అది ఎలా అనేది ఈ సినిమా కథ.
Bimbisara Movie Review :పనితీరు

త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటి కథగా ఉండనుంది. హాఫ్ పార్ట్ గ్రాఫిక్స్ తో నడిచే ఈ చిత్రం ఆడియెన్స్ కు తప్పకుండా నచ్చుతుందన్నారు. మూవీలోని పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పాటు.. ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
తొలిసారి చక్రవర్తిగా నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక సాంకేతిక నిపుణులు కూడా అద్భుతంగా పని చేశారు. గ్రాఫిక్స్, విజువల్స్, సంగీతం ఇలా అన్ని విషయాలలో అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోను సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
విశ్లేషణ:
బాలయ్య నటించిన ‘369’ చిత్రం టైమ్ ట్రావెల్ గా వచ్చి ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఆదరించే ప్రేక్షకులున్నారు. మరోసారి నందమూరి ఫ్యామిలీ నుంచి టైమ్ ట్రావెల్ బెస్డ్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా కూడా కాస్త కొత్తదనంతో ఆకట్టుకుంది. అన్నింటా పాస్ కావడంతో సినిమాకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. నందమూరి అభిమానులు కాలర్ ఎత్తుకొనే సినిమా ఇది అని చెప్పవచ్చు.
రేటింగ్ 3/5