Intinti Gruhalakshmi 5 August Today Episode 703 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 5-August-2022(703 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. సామ్రాట్, నందు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. అప్పుడు లాస్య, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయి దగ్గర ఓడిపోతారేమో, అన్న భయం కూడా లేకుండా, పోటీలో దిగారు. మీది ఎంత గొప్ప మనసు అని, అంటూ, ఉంటుంది. అప్పుడు సామ్రాట్ నా నమ్మకం అంతా ఒక్కటే, నేను విడిపోయే ప్రసక్తే లేదు, అని అనగానే, లాస్య మనసులో అంత నమ్మకం పెట్టుకుంటే, ఓడిపోతే చాలా బాధ కలుగుతుంది, అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి మనసులో, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని లాస్య పాడుచేస్తుంది, ఏం చేయాలో, అని అనుకుంటూ ఉంటుంది.
సామ్రాట్ తులసీ వైపు చూస్తాడు, తులసి సైగ చేస్తూ ఉంటుంది, దాంతో తులసికోసం, తను ఓడిపోతాడు కావాలని, నందు చేతుల్లో. అందరూ నందుకి కంగ్రాట్స్ చెబుతారు. తరువాత తులసి బయటికి వెళుతోంది, తులసి దగ్గరికి సామ్రాట్ వెళతాడు, సారీ అండీ గెలవాల్సిన మిమ్మల్ని ఓడిపోయేలా చేశాను అనగానే, సామ్రాట్ అదేం లేదండీ గెలవడం కాదు, ఇంటికొచ్చిన మనుషులని గౌరవించాలి, అనేది ముఖ్యమని మీరు తెలియజేశారు, అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లను చూసి తులసి అత్తమామలు సంతోషపడుతూ ఉంటారు. సామ్రాట్, తులసితో మీకొక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని, లోపలికి రండి అని అంటాడు.
Intinti Gruhalakshmi 5 August Today Episode 703 : తులసి కోసం నందు చేతిలో ఓడిపోయిన సామ్రాట్.
Intinti Gruhalakshmi 5 August Today Episode 703అందరి ముందు తులసికి, మీరు మా హనీ పాపని గెలిపించినందుకు మీకు గిఫ్ట్ అని చెప్పి, వీణ ని బహుమతిగా ఇస్తాడు సామ్రాట్.అప్పుడు తులసి థాంక్స్ అండీ, మీ బహుమతి చాలా బాగుంది, అనగానే, అయితే మాకు ఒక బహుమతి కావాలి, మీరు మొదటి పాట ఇక్కడే పాడాలి అని, సామ్రాట్ అంటాడు. అందరూ అడుగుతూ ఉంటారు పాడమని, దాంతో తులసి పాట పాడటం మొదలు పెడుతుంది. తులసి పాటకు అందరూ చప్పట్లు కొడతారు. సామ్రాట్ నందుతో, తులసిగారు ఎలా పాడారు నందు అనగానే, అప్పుడు నందు బాగా పాడారు అని అంటాడు. మీ గొంతు ఎంత బాగుంది, మీ స్వరం చాలా గొప్పది, ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు అని, ఇలా మెచ్చుకుంటూ ఉంటాడు సామ్రాట్ తులసిని, ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.