Bigg Boss 6 Telugu : బిగ్బాస్ సీజన్ 6 కి సన్నాహాలు, ఈసారి లీకులు ఉండవట ఇది ఎంతవరకు నిజం.

Bigg Boss 6 Telugu : మన తెలుగులో బిగ్ బాస్ సీజన్6 కి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 హోస్ట్ గా నాగార్జునతో ప్రోమో షూటింగ్ కూడా అయిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో కొత్త బిగ్ బాస్ సెట్ కూడా ఆల్రెడీ నిర్మిస్తున్నారని సమాచారం. గడిచిన సీజన్ల అన్నిట్లో వీకెండ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది ముందే లీక్ అయ్యేది. ఇలా జరగటం వల్ల షో మీదున్న ఆసక్తి ప్రేక్షకులకి తగ్గిపోతుందని అభిప్రాయం బిగ్ బాస్ షో నిర్వాహకులకు కలిగి అటువంటి లీకులు ఇకమీద జరగకూడదని ప్లానింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

అంతేకాకుండా వీక్ ఎందుకు సంబంధించిన ప్రోగ్రాంలో కీలక మార్పులను చేయాలని ఆలోచిస్తున్నట్లు విశ్వసినీయవర్గాల ఇన్ఫర్మేషన్. వీకెండ్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా బయటికి రాకుండా చూడాలని నిర్ణయించారట. ఈ విధంగా జాగ్రత్త పడితే బిగ్ బాస్ ఖచ్చితంగా మంచి రేటింగ్ తో దూసుకెళ్లిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారని అనుకుంటున్నారు. అంతేకాకుండా ప్రోగ్రామ్ జరిగే చోట సెక్యూరిటీ మరియు చర్యలు తీసుకోవడంతో ఇలాంటి లీకులు అరికట్టాలని చూస్తున్నట్లు సమాచారం.

Bigg Boss 6 Telugu : ఈసారి లీకులు ఉండవట ఇది ఎంతవరకు నిజం.

bigg boos seson6 is getting ready this time no leaks about show
bigg boos seson6 is getting ready this time no leaks about show

అందులో భాగంగానే కాస్త బడ్జెట్ ఎక్కువైనా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఇలాంటి లీకులకి ఎటువంటి తావు ఇవ్వకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు చివరివారంలోనూ లేదా సెప్టెంబర్ లో మొదటి నుండి బిగ్ బాస్ షో సీజన్ 6 మొదలు చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన ఈ లీకులను అరికడితే షోకి మంచి రేటింగ్ వస్తుందన్న అభిప్రాయం నిర్వహణకులలో బలంగా ఉందని తెలుస్తుంది. కంటెస్టెంట్ల విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయాలను అధికారికంగా ప్రకటించే అధికారసం లేదు కాబట్టి కంటిస్టేట్లు స్టేజ్ మీదికి వచ్చేవరకు ఎవరికీ ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా చూసుకోవడంలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తుంది.