Hansika : పెళ్లికి రెడీ అంటున్న హన్సిక… వరుడు ఎవరో కాదు ఆ పొలిటీషియన్ కొడుకేనట…

Hansika : హీరోయిన్ హన్సిక అతి చిన్న వయసులోనే గ్లామరస్ హీరోయిన్ గా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది. అల్లు అర్జున్ నటించిన ‘ దేశముదురు ‘ సినిమాలో హీరోయిన్ గా చేసింది. తన గ్రామర్ తో తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడికి ఎక్కువగా పెద్ద సినిమాల్లో అవకాశం రాలేదు. ఎప్పటికప్పుడు మిగతా హీరోయిన్స్ తో పోటీ ఇవ్వలేకపోవడంతో చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. హన్సిక ముంబైలో సెటిల్ అయినా ఒక సింది ఫ్యామిలీలో జన్మించింది. ఆమె తండ్రి ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇక హన్సిక చిన్నతనం నుంచే నటనపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంది. అందుకే చిన్ననాటి నుంచి నటించడం మొదలుపెట్టి సీరియల్స్ లో కూడా నటించింది తన కెరీర్లో షకలక బూమ్ బూమ్ టెలివిజన్ సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె కొన్ని హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది.

పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు పూరి జగన్నాథ్ కంటపడటంతో అల్లు అర్జున్ జోడిగా ‘ దేశముదురు ‘ సినిమా ద్వారా పరిచయం చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వాస్తవానికి అప్పట్లో హన్సికాకు పదహారేళ్ళ వయసు అంటే ఎవరు నమ్మలేదు ఎందుకంటే అంత చబ్బీగా ఉండేది. తర్వాత తమిళ్ తెలుగు ,మలయాళం మరి ముఖ్యంగా తెలుగులో మస్కా, కందిరీగ సినిమాలతో మంచి గుర్తింపును అందుకుంది. ఇక తమిళంలో సూర్య, విజయ్ వంటి పెద్ద హీరోలతో కూడా నటించింది. అయితే చివరగా తెలుగులో తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ సినిమాలో నటించింది.

Hansika : పెళ్లికి రెడీ అంటున్న హన్సిక… వరుడు ఎవరో కాదు ఆ పొలిటీషియన్ కొడుకేనట…

hanisika marriage settled with politician and business man
hanisika marriage settled with politician and business man

అయితే హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. సౌత్ కి చెందిన ఓ పెద్ద పొలిటీషియన్ కుమారుడుతో ఏడడుగులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే అది నిజం కాదని ఆమె కాబోయే భర్త బిజినెస్ రంగంలో సెటిల్ అయ్యారని అంటున్నారు. ఇప్పటికే వీరి కుటుంబాలు కలిసి చర్చించుకున్నారు అని నిశ్చితార్థానికి డేట్ కూడా ఫిక్స్ చేయనున్నారని తెలుస్తుంది. దీనిపై హన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వబోతుందని టాక్ వస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో కొన్ని రోజులు వేచి చూడాలి.