Bigg boss 6 Telugu : బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా బిగ్ బాస్ 6 సీజన్ లోగోను కూడా స్టార్ మా యాజమాన్యం లాంచ్ చేసింది. ఇంకొన్ని రోజుల్లో బిగ్ బాస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయిందట.

బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి ఓటీటీ సీజన్ వరకు బిగ్ బాస్ కు చాలా రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను క్యాచ్ చేసుకోవడానికే బిగ్ బాస్ ఆరో సీజన్ ను త్వరలో ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఈ షో చాలా ఇతర భాషల్లోనూ పాపులర్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ వన్ కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండో సీజన్ కు నాని హోస్ట్ గా ఉన్నాడు. మూడో సీజన్ నుంచి మాత్రం నాగార్జునే ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఓటీటీకి కూడా నాగార్జునే హోస్ట్ చేశాడు. ఆరో సీజన్ కు కూడా నాగార్జునే హోస్ట్ గా ఉండనున్నాడు.
Bigg boss 6 Telugu : బిగ్ బాస్ 6 లోకి రానున్న కంటెస్టెంట్లు వీళ్లే
సెప్టెంబర్ లో కొత్త సీజన్ ఘనంగా లాంచ్ కానుంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ 6 కి సంబంధించిన సెట్ కూడా వేసేశారు. కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయింది కానీ.. ఎవరు రానున్నారు అనేదానిపై క్లారిటీ లేదు. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం ఓ లిస్ట్ తెగ హడావుడి చేస్తోంది. స్టార్ యాంకర్ ఉదయ భానుతో పాటు దీపికా పిల్లి, శ్రీహాన్, ఆర్జే సూర్య, అమర్ దీప్, ఆది రెడ్డి, చలాకీ చంటి, గీతూ రాయల్, నేహా చౌదరి లాంటి కంటెస్టెంట్లు ఈసారి బిగ్ బాస్ లోకి రానున్నారట.
#BiggBossTelugu6 makes it more captivating to all audiences of Telugu. The color palette used for the fluidic lines comes together to create an intense emotional experienced when it begins. This time, #BiggBoss eye is alluring
Season of Entertainment begins soon on #StarMaa. pic.twitter.com/EmjwkdKFps— starmaa (@StarMaa) August 4, 2022
ఇప్పటికే జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ నటి తేజస్వితో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు. మరి పెళ్లి అయ్యాక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడతాడా? లేక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక తేజస్విని పెళ్లి చేసుకుంటాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఈ కంటెస్టెంట్లు కన్ఫమ్ అవుతారా? లేక వేరే వాళ్లు ఈ లిస్టులో యాడ్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.