Mrunal Thakur : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయి, సూపర్ డూపర్ హిట్ అయిన సీతారామం మూవీలో సీత అనే పాత్రలో నటించి, మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఇది మొదటి సినిమా అయినప్పటికీ కూడా, తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 2012 నుంచి మృణాల్ ఠాకూర్ తన కెరియర్ని మొదలుపెట్టింది. మృణాల్ ఠాకూర్ చేసిన లాక్మే నైన్ టు ఫైవ్ సిసి క్రీమ్ లుక్ న్యాచురల్ అండ్ ఫ్లాలెస్ అనే యాడ్ లొ నటించి చాలా ఫేమస్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ తన బాయ్‌ఫ్రెండ్ శరత్ చంద్ర త్రిపాఠి తో కలిసి నాచ్ బలియే సీజన్ సెవెన్ అనే, డ్యాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసారు.
2014 లొ హిందీలో కుంకుమ్ భాగ్య అనే సీరియల్లో, హీరోయిన్ కి చెల్లి క్యారెక్టర్ లొ, బుల్బుల్ అనే పాత్రలో నటించి మంచి పేరు సంపాదించుకుంది . హిందీలో ఈ సీరియల్ హిట్ కావడంతో, తెలుగులో కూడా, జీ తెలుగులో ఈ సీరియల్ డబ్బింగ్ ప్రసారం అవ్వడం జరిగింది, అలా తెలుగు ప్రేక్షకులను బుల్బుల్ కొంతవరకు పరిచయం అయ్యింది అని చెప్పొచ్చు. సీరియల్స్, షోస్ ఇలా ప్రతి చిన్న పాత్రలను చేస్తూ ఉండేది.అలా చేస్తూ తనకి 2018 లొ లవ్ సోనియా మూవీలో సోనియా రోల్ ఆడిషన్లో తను సెలక్ట్ అయింది. బాలీవుడ్లో హృతిక్ రోషన్‌తో కలిసి 2019 లో సూపర్ 30 అనే మూవీలో నటించింది.
Mrunal Thakur : సీతారామం మూవీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి తెలియని కొన్ని విషయాలు మీ కోసం ….

2021 లొ ధమాకా అనే మూవీలో కూడా నటించింది.2022 లో షాహిద్ కపూర్ తో కలిసి జెర్సీ అనే మూవీని కూడా నటించింది. దాని తరవాత ఈ మధ్య కాలంలో తెలుగులో సీతారామం మూవీలో నటించింది. తెలుగులో కుంకుమ భాగ్య సీరియల్ తొ కొంతమందికి పరిచయం అయిన మృణాల్ ఠాకూర్, ఇప్పుడు సీతా రామo మూవీతో అందరికీ తెలిసేలా, తనకంటూ గుర్తింపు సాధించుకుంది. తెలుగు లొ ఒక్క సినిమాతోటే నక్క తోక తొక్కినట్టు అనే విధంగా లక్కుతో, తన కెరియర్ లో మంచి ఇమేజ్ ని సంపాదించుకుంది. మృణాల్ ఠాకూర్ ఇంకా తెలుగులో మంచి మంచి సినిమాలు చేయాలని, మంచి అవకాశాలు రావాలి అని ఇక్కడ తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.