Samantha : ఇరకాటంలో సమంత…తారక్ తో ఎటు తేల్చుకొని స్థితిలో బ్యూటీ..

Samantha : సమంత వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. తన డేట్స్ విషయంలో అడ్జస్ట్ చేయలేక అయోమయంలో పడిందని అంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా ఆఫర్ రావటంతో ఆమె ఎటు తేల్చుకొని స్థితిలో పడిపోయిందంట. ప్రస్తుతం ఈ అమ్మడు జోరుగా సినిమాలు చేస్తుంది. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన కెరీర్లో బాగా దూసుకెళుతోంది. ఈ క్రమంలో సినిమాలతో బిజీ బిజీగా తీరిక లేకుండా దర్శక నిర్మాతలకు డేట్స్ ఇస్తుంది. మేకర్స్ సైతం తమ సినిమాల్లో సమంతను తీసుకోవడానికి లైన్ కడుతున్నారు. ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పొందింది బ్యూటీ. ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తుండడంతో అయోమయంలో పడిందంట.

ప్రస్తుతం సామ్ బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ లో కూడా నటించబోతుంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి ‘ ఖుషి ‘ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇంకొందరు పెద్ద స్టార్స్ సమంత డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారట. ఆ లిస్టులో ఎన్టీఆర్ ఉన్నారని టాక్. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాను తీయబోతున్నారన్న సంగతి తెలిసిందే. ‘ ఎన్టీఆర్ 30 ‘ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ విషయంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు కొరటాల. ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలించినాయన చివరకు సమంతకు ఓటేశారట. ఎన్టీఆర్ కూడా సమంతా పై మక్కువ చూపుతున్నట్లు ఇన్సైడ్ టాక్.

Samantha : ఇరకాటంలో సమంత…తారక్ తో ఎటు తేల్చుకొని స్థితిలో బ్యూటీ..

samantha planning dates for NTR30 Koratala shiva movie
samantha planning dates for NTR30 Koratala shiva movie

అలాగే సమంత కూడా ఎన్టీఆర్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుందంట. తారక్ సినిమాను వదులుకోవడం సమంతాకు అస్సలు ఇష్టం లేదని తెలుస్తుంది. ఆమెకు వచ్చిన సమస్య డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం. ఇప్పటికే ఒకే చెప్పిన సినిమాలతో బిజీ అయినా సమంత ఈ సినిమాకు ఎలా డేట్స్ కేటాయించాలని అయోమయంలో పడిందంట. ఏమాత్రం ఛాన్స్ ఉన్న తారక్ సినిమాలో నటించాలని ప్రయత్నిస్తుందట. ఇకపోతే మాస్ యాక్షన్ గా రాబోతున్న ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ చేశారట. ఎన్టీఆర్, సాయి పల్లవి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశారని ఇద్దరి స్క్రీన్ ప్రజెంట్, స్టెప్పులతో థియేటర్స్ హోరెత్తిపోయేలా కొరటాల ప్లాన్ చేస్తున్నారని సమాచారం.