Guppedantha Manasu 10 August Today Episode 525 : సాక్షి తో రిషి పెళ్లి ఆపేయమని దేవయానిని ప్రాధేయపడ్డా మహేంద్ర.రిషి తీసుకున్న నిర్ణయానికి జగతి, మహీంద్రా కుమిలిపోతూ ఉంటారు.

Guppedantha Manasu 10 August Today Episode 525 : గుప్పెడంత మనసు సీరియల్ 10-aug-2022(525) ఎపిసోడ్ ముందుగా మీ కోసం ….. సాక్షి మీద రిషి కొపడుతున్నాడని దేవయాని సాక్షిని బయటికి లాక్కొస్తుంది. తీరా బయట చూస్తే జగతి, వసుధార ఇద్దరూ ఉంటారు. సాక్షి తిరిగి వసుదార పైన కోప్పడుతుంది.సాక్షి వసుదారని తిడుతుంటే దేవయాని ఆపే ప్రయత్నం చేస్తోంది. కానీ సాక్షి ఆపకుండా సాక్షినే తిడుతూనే ఉంటుంది. ఇంట్లోకి రానీయకండి బయటికి వెళ్ళిపో అని అనగానే ఇంతలో రిషి డోర్ ఓపెన్ చేసి వస్తాడు రిషి ని చూసి కోపంగా సాక్షి వెళ్లిపోతుంది. జగతి వెంటనే నాతో పని ఉండి వసుదార వచ్చింది సార్ అని చెప్తోంది. వసుధార నేను రిషి సార్ తో మాట్లాడుతాను అంటె జగతి మేడం వద్దు ఇప్పుడు, రిషి మూడ్ బాగొలేదు ఇది సరైన సమయం కాదు అని చెప్పి ఆపుతుంది. కానీ వసుధార ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోవాలి అని మాట్లాడతాను అని అంటుంది.ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది కదా మేడమ్ అని వసుధార అంటుంది.

మనం అనుకున్నవి అన్నీ జరగవు ఊహించని పరిణామాలు చాలా జరుగుతాయి నా మాట విని సైలెంటుగా ఉండు వసు అని జగతి అంటోంది. సరే మేడమ్ నేనేం మాట్లాడను అని చెప్పి వసుదార వెళ్లిపోతుంది.వసుధార ఏదో ఆలోచించుకుంటూ పైనుండి కిందికి దిగుతుంటే మెట్లమీదనుంచి జారిపడబోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు.ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.చూసుకోలేదు సార్ అని వసుదార అనగానే ఆ పరధ్యానం ఏంటి అని రిషి అంటాడు. పరధ్యానం ఏమీ లేదు సార్ మీ ధ్యానమే అని వశధార అంటోంది.సార్ మీతో మాట్లాడాలి అని అనగానే ఇంతలో అక్కడికి దేవయాని వచ్చి సాక్షి వాళ్ల పేరెంట్స్ లగ్నపత్రిక రాయించడానికి రేపొస్తండారంట అని చెబుతుంది. అలాగే వసుదార నువు కూడా వస్తే బావుంటుంది రమ్మని పిలుస్తోంది. అలాగే మేడం అని వసుధార కూడా చెప్తుంది.చిన్న పనుందని చెప్పి రిషి వెళ్లిపోతాడు. తర్వాత వసు కూడా వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత హాల్లో మహేంద్ర, జగతి సైలెంటుగా కూర్చొని ఉంటే అక్కడికి దేవయాని వచ్చి ధరణి వచ్చావా అందరికీ సీట్లు చెయ్యి ముఖ్యంగా జగతి ఏం కావాలో అడిగి మరీ చెయ్యి అని చెప్తుంది.

Guppedantha Manasu 10 August Today Episode 525
Guppedantha Manasu 10 August Today Episode 525

రేపు సాక్షి వాళ్ల పేరెంట్స్తో లగ్నపత్రిక రాసుకోవడానికి వస్తున్నారు మీకు తెలియదా అందుకే స్వీట్ చేయమంటున్నాను అని దేవయాని అంటోంది. ఏంటిది వదినా అని మహీంద్రా అడుగుతాడు రిషి కి ఇష్టం లేకున్నా బలవంతంగా ఎలా జరుగుతుంది ఇదంతా జరగడానికి కారణమేంటి అని మహీంద్రా అడుగుతాడు. నేనేం చేశాను మహేంద్ర అని అనగానే ఈ పెళ్లి ఆపేయండి వదినా అని మహీంద్రా అంటాడు. నన్ను చెప్పమంటావెంటి మహేంద్ర నేను ఈ పెళ్లి ఆపు అని సాక్షి తో కూడా చెప్పాను కదా అని అంటోంది దేవయాని.నువ్వేం చెప్పిని చేస్తాను వదినా కావాలంటే జీవితాంతం రిషి జగతిని అమ్మ అని పిలవకుండా చేయమన్నా చేస్తాను కానీ పెళ్లి మాత్రం ఆపేయ్ అని మహీంద్రా బతిమిలాడతాడు. అయినా కూడా దేవయాని వినదు రిషి ఒప్పుకున్నాడు నేను సరే అన్నాను అని దేవయాని అంటోంది దానికి జగతికి కోపం వస్తుంది. మనుషుల్లో ఉన్న రాక్షసత్వం పోయినప్పుడు అందరూ పండగ చేసుకుంటారు కదా మహీంద్రా అలాగే కంపల్సరీ ఏదో ఒకరోజు రాక్షసత్వం పోతుంది అప్పటి వరకు ఎదురు చూడాలి అని జగతి చెబుతుంది.

Guppedantha Manasu 10 August Today Episode 525 : రిషి తీసుకున్న నిర్ణయానికి జగతి, మహీంద్రా కుమిలిపోతూ ఉంటారు.

ఒక మంచి పని జరగడం కోసం మనం మనం కోరుకోవాలి నమ్మాలి అని చెప్తుంది జగతి అలాగే ఒక చెడ్డ పని జరిగినప్పుడు అది జరగదు జరక్కూడదని మనసులో గట్టిగా అనుకోవాలిఅనే జగతి చెపుతుంది.అలాగే కొద్దిసేపు సంభాషణ జరుగుతుంది.రిషి కార్లో వెళ్తుంటే వసుధార ఆటోలో ఎదురుపడే ఆపుతుంది. వసుదార ఎందుకొచ్చిందొ అని రిషీ మనసులో అనుకుంటూ ఉంటాడు.మీతో మాట్లాడాలి సార్ అని వసుధరా అంటోంది. మాట్లాడ్డానికేమీ లేదు అని అంటాడు రిషి. మీకు చెప్పాలని చాలా ఉన్నాయి సార్ కానీ చెప్పే బాధ్యత తనకుందని అనుకుంటున్నాను అని వసు అనగానే ఆపు అని రిషి అంటాడు.అంశాలను ఏమడుగుతావో ఏం చెప్తావో నాకు బాగా తెలుసు కానీ నేను ఒకరికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రిషి అంటాడు.ఎవరికి మీరు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు సార్ కానీ మీకంటూ ఒక మనసు ఉంటుంది కదా ఆ మనసుకి సంజాయిషీ చెప్పాలి కదా అని వసుదార అంటోంది.వసుదార ఏం చేయాలో నాకు బాగా తెలుసు నా నిర్ణయం నాది నా జీవితం నాది.

నీది నీ ఆశ చేయాలనేది అంతేకానీ నీ మీద అభిమానం నాకు తగ్గదు నా మీద గౌరవం నీకు తగ్గదని నేననుకుంటున్నాను అని రిషి అంటాడు.ఏమంటారు సార్ సాక్షి ఎన్ని ద్రోహం చేసింది ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు చేసింది అయినా సరే సాక్షిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు సార్ అని వసుధరా అంటోంది.ఒక్కొక్క సారి మనకు తెలియకుండానే తప్పుడు అడుగులు వేయాల్సి వస్తుంది అని రిషి అంటాడు.అలా రిషి ,వసుదార కొద్దిసేపు మాట్లాడుకుంటారు అయున రిషి తన నిర్ణయాన్ని మార్చుకోడు.రిషి తీసుకున్న నిర్ణయానికి వసుదార ఏం మాట్లాలేకపోతోంది. తర్వాత రిషి జగతి రూమ్లో కూర్చొని చాలా బాధపడి కుమిలిపోతూ ఉంటారు. ఏంటిది జగతి సాక్షితో పెళ్లి ఏంటి అసలు వాడి మనసులో ఆలోచన ఎలా పుట్టింది అని మహీంద్రా చాలా బాధపడతాడు ఏడుస్తాడు కూడా.

ప్రతి పని నాకు చెప్పి చేసే రిషి ఇలా చేశాడేంటి జగతి. వాడు నా ఫ్రెండ్ షిప్ కట్ చేశాడు అని మహేంద్ర కుమిలి కుమిలి పోతూ ఉంటాడు. ఇప్పుడు వసుధార సంగతి ఏం చేద్దాం మాట్లాడడమేంటి జగతి అనే మహేంద్ర అంటాడు. ఏం మాట్లాడను తెలియట్లేదు నువు అడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం తెలియదని జగతి అంటోంది.ఒకరకంగా దీని అన్నిటికీ నేను కూడా కారణమేమో అనే జగతి అంటోంది.మనిద్దరం ఒక్కటైనందుకు నీకు రిషి దూరం అయ్యాడేమో మహేంద్ర. రిషి నికు దూరం అవ్వడానికి నేనే కారణమేమో అనే జగతికూడా బాధపడుతుంది.మనిద్దరం ఒక్కటయ్యే రిషీ గురించి మనం ఆలోచించడం మానేసామ రిషి విషయంలో మాత్రం తప్పు చేశామేమో అనే జగతి అంటోంది. ఇంటర్తో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.