Jabardasth Varsha : ప్రస్తుతం జబర్దస్త్ షోలో బాగా డిమాండ్ ఉన్న జోడి ఇమ్మానుయేల్, వర్ష. సుడిగాలి సుదీర్, రష్మీ జోడి తర్వాత అంతటి గుర్తింపు పొందిన జంట వీరిద్దరే. దీనికి కారణం ఆ ఇద్దరి మధ్య నడిచే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నే. వీళ్ళ చేష్టలతో ఇద్దరిపై జనాల్లో అనుమానాలు పెరిగాయి. చూడడానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ కామెడీ టైమింగ్ ఆన్ స్క్రీన్ పర్ఫామెన్స్ ద్వారా జనాల మెప్పు పొందారు. రొమాంటిక్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. చాలాసార్లు స్టేజ్ పై రొమాంటిక్ సాంగ్స్ కి డాన్స్ లేసి తమ మధ్య కెమిస్ట్రీ ఎంత బలంగా ఉందో నిరూపించారు ఇమ్ము ,వర్ష. సింగిల్ గా కంటే జంటగానే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. జబర్దస్త్ జడ్జీలు సైతం ఈ జోడి పర్ఫామెన్స్ చూసి ఫీదా అవుతుంటారు.
దీంతో ఇమాన్యుయల్, వర్ష మధ్య ఏదో రిలేషన్ ఉందని పుకార్లు వస్తున్నాయి. కొన్ని స్పెషల్ ఈవెంట్స్ లో కూడా ఇమాన్యుల్ వర్షాలకు పెళ్లి చేసేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్మానుయేల్ ప్రేమలో వర్ష మునిగితేలుతుందని అందరూ అనుకుంటున్నారు. దీనికి తోడు ఇద్దరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు లవ్ సింబల్స్ వేసి షోకి టిఆర్పి తెప్పించుకుంటున్నారు నిర్వాహకులు. ఏదేమైనా ఇమ్ము వర్షాల లవ్ ఎఫైర్ అనేది మాత్రం నిత్యం హాట్ టాపిక్ గాని నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన లవ్ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది వర్ష. తన మనసులో మాట అని చెప్పేసి అందరిని షాక్ కు గురిచేసింది.
Jabardasth Varsha : అతను కాదంటే చచ్చిపోతా… అంటూ వర్ష షాకింగ్ కామెంట్స్….

ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ లో అందులో ఒక సీను కనిపించింది. ఇమ్ము అందరిలో ఒక డౌట్ ఉంది, అసలు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేదా అని అంటూ వర్ష వెంటనే ఒక్కసారిగా అతనిపై తన లవ్ ని బయటకు చెప్పేసింది. ఇమ్ము కాదన్న రోజు ఈ వర్ష ఊపిరి ఆగిపోతుంది అని ఆమె చెప్పడంతో ఇమ్ము తెగ సంబరపడిపోతాడు. అంటే వీళ్లిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారని తాజా ప్రోమో కన్ఫర్మ్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకే ఒక లోకం నువ్వే అనే సాంగ్ వేసి మరింత ఎట్రాక్ట్ చేశారు. మరి చూడాలి ఇక ఇది నిజమో కాదో.