Bimbisara Child Artist : బింబిసార సినిమాలో నటించిన చిన్నారి పాప ఎవరో తెలుసా…?

Bimbisara Child Artist : ఈ మధ్యనే రిలీజ్ అయిన బింబిసార సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్లిపోతుంది. కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది. చిత్ర పరిశ్రమకు కరోనా తర్వాత ఏదైనా శుభవార్త ఉందంటే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మన సినిమాలు చాలా వరకు విజయవంతం కావడమే. బాహుబలి 2 తర్వాత ఇండస్ట్రీకి పెద్దగా హిట్లు రాలేదు. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటివి ఉండగా తాజాగా బింబిసార సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారింది. మంచి కథతో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ పరంగా దూసుకెళ్లిపోతుంది. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్, తాజాగా రిలీజ్ అయిన కళ్యాణ్ రామ్ బింబిసార,ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి.

Bimbisara Child Artist : బింబిసార సినిమాలో నటించిన చిన్నారి పాప ఎవరో తెలుసా…?

ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు కథలు ఒకే పాప చుట్టూ తిరిగే మూవీస్ కావడమే. ఆర్ఆర్ఆర్ లో మల్లీ అనే పాప కోసం ఎన్టీఆర్ స్టోరీ నడుస్తుంది. ఇక లేటెస్ట్ గా వచ్చిన బింబిసార సినిమాలో కూడా కథ పాప చుట్టూ నడుస్తుంటుంది. తనను రక్షించిన పాప కోసం బింబిసారుడు ఎలా మారిపోయాడు అనేది స్టోరీ. ఇక బింబిసార సినిమాలో నటించిన పాప పేరు శ్రీదేవి. ఈ పాపకి ఇది తొలి సినిమా కాదు. దీనికి ముందు రామారావు ఆన్ డ్యూటీ, మేజర్ వంటి సినిమాల్లో కూడా ఈ చిన్నారి నటించింది.

Do you know who is Chinnari Papa who acted in the movie Bimbisara
Do you know who is Chinnari Papa who acted in the movie Bimbisara

అలాగే ప్రేమ, యమలీల, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్ లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈ శ్రీదేవి తన తండ్రి ద్వారా మూవీస్ లోకి అడుగు పెట్టింది. తన తండ్రి పేరు శ్రీహరి గౌడ్. ఇతను ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. కర్నూలు జిల్లా బేతంచెర్ల కు చెందిన వ్యక్తి. షూటింగ్ కోసం హైదరాబాదులో ఉంటున్నారు. సినిమాకి గాను శ్రీదేవికి మంచి గుర్తింపు వచ్చింది. పాప యాక్టింగ్ కూడా తన వయసుకి మించి చేసిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. శ్రీదేవి హావభావాలు, డైలాగులు ఈ సినిమాకు మంచి పేరు తీసుకొచ్చాయని అభిమానులు చెప్పుకుంటున్నారు.