Muskmelon : వేసవికాలంలో బయట నుంచి ఇంటికి రాగానే శరీరాన్ని చల్లబడుచుకోవడానికి చల్లటి పదార్థాల వైపు ఆసక్తి చూపుతారు. ఎండాకాలంలో కాస్తే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే వేసవికాలం లభించే పండ్లు ఎన్నో మార్కెట్లలో లభిస్తాయి. ఎండకాలం తన వెంట కొన్ని పనులను తీసుకుని వస్తుంది. అటువంటి వాటిలో ఖర్బుజ ఒకటి. వేసవికాలంలో సాధారణంగా రోడ్లపైనే ఎక్కడ చూసినా కర్బూజా పండ్లు కనిపిస్తుంటాయి. ఎండాకాలంలో లభించే ఈ పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. కర్బూజా లో ఉండే బీటా కేరోటిన్ వివిధ రకాల క్యాన్సర్ కణాలను తొలగించి, ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తుంది. ఈ పండు కంటి చూపును మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
విటమిన్ ఏ కంటి సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా శరీరానికి అందజేస్తుంది. తెల్ల రక్త కణాలను పెంపొందించడంలో ఈ పండు కీలక పాత్ర వహిస్తుంది. ఎండాకాలంలో ఎదుర్కొనే సమస్యల లో ఒకటైన వడదెబ్బ నుండి కర్బుజా రక్షిస్తుంది. వేసవికాలంలో బాగా బయట తిరిగేవారు కర్బుజా జ్యూస్ తాగడం ఉత్తమం. విటమిన్ కె, ఇ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతానం లేని తో బాధపడేవారు ఈ పండుని రోజు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. పురుషులు పైల్స్ వంటి సమస్యతో బాధపడే వారికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరచడంలో కర్బుజా బాగా సహాయపడుతుంది.
Muskmelon : కర్బుజ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి.

కర్బూజా లో పోషకాలు అధికంగా ఉండడం వల్ల గుండెకి అవసరమయ్యే నూట్రియన్స్ ని అందజేస్తాయి. గుండె సంబంధిత సమస్యలతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కర్బుజా కీలక పాత్ర వహిస్తుంది. ఇక ఈ పండులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల జీర్ణశక్తి పనితీరు మెరుగుపరుస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు సమస్యతో బాధపడేవారు ఈ పండును రోజు తినడం వల్ల రాళ్లు కరిగిపోతాయి. వేసవికాలంలో పుచ్చకాయ తర్వాత ఎక్కువగా వినియోగంలో ఉన్న పండు కర్బుజా. వేసవిలో కర్బుజాని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.