Eesha Rebba : సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఓ దర్శకుడు, ఓ హీరో హీరోయిన్, నిర్మాత హీరోయిన్ కలిసి కనిపించారంటే ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు. ఇండస్ట్రీలో కొందరు దర్శకులతో హీరోయిన్స్ సన్నిహితంగా ఉంటారనే మాట మనం వింటూనే ఉంటాం. అలా దర్శకులు అండగా ఉంటేనే హీరోయిన్స్ స్టార్స్ గా వెలుగుతారనేది కూడా ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకులలో జరిగే చర్చ. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ మన దర్శకులు కొందరు ఎక్కువగా ఓకే హీరోయిన్ తమ సినిమాలలో రిపీట్ చేస్తూ ఉంటారు.
దీనివల్ల ఆ హీరోయిన్ కి డైరెక్టర్ కి లింకులు పెట్టి గట్టిగానే వార్తలు రాస్తున్నారు. వీటిపై స్పందించి అటువంటిది ఏమీ లేదు ఆ అమ్మాయిలో టాలెంట్ ఉంది. నా కథకి సెట్ అవుతుందని అంటుంటారు. అందుకే రెగ్యులర్ గా తనని తీసుకుంటున్నాను, అంతే తప్ప నేను రాసుకున్న కథలు ఆమె సూట్ అవ్వకపోతే ఆమె ప్లేసులో ఇంకో హీరోయిన్ తీసుకోవాల్సిందే కదా అని క్లారిటీ ఇస్తుంటారు. ఈ మాటలన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పిన మాటలు. ఆయన స్థానంలో ఉన్న ప్రతి దర్శకుడు తన సినిమాల్లో రిపీటెడ్ గా ఒకే హీరోయిన్ ని తీసుకుని దర్శకులందరు చెప్పే మాట ఇదే.
Eesha Rebba : మన తెలుగు అమ్మాయికి, ఆ డైరెక్టర్ కి మధ్య ఉన్నది నిజమేనా…
ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా హీరోయిన్ ఈషా రెబ్బ విషయంలో ఇలాగే చెప్పారట. తెలుగు అమ్మాయి అయినా ఈషా రెబ్బ అంతకుముందు ఆ తర్వాత, అమీ తుమీ, బందిపోటు సినిమాలలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంద్రగంటి ఇలా మూడు సినిమాల్లో ఒకే హీరోయిన్ ని తీసుకోవడంపై అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో ఈషా కి సపోర్ట్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అని. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆయన రాసుకున్న హీరోయిన్ పాత్రలకి ఈశా సూట్ అవుతుందని తనని తీసుకోవడం జరిగింది తప్ప మరో ఉద్దేశం లేదని ఆయన చెప్పి సైలెంట్ అయ్యారు.