Vishnu Priya : విష్ణు ప్రియ ఏంటి ఎలా తయారైంది… హీరో అఖిల్ తో ఒక్కసారి అంటూ కామెంట్స్…

Vishnu Priya : బుల్లితెరలో యాంకర్ విష్ణు ప్రియ పోవే పోరా ప్రోగ్రాం తో మంచి పాపులారిటీని దక్కించుకుంది. గట్టి గట్టిగా అరుస్తూ అల్లరి పిల్లల ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పెట్టి కుర్రాలను వేడెక్కిస్తుంటుంది. అలాగే ఐటమ్ సాంగ్ పాటలకు స్టెప్పులు వేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. అయినా ఈ అమ్మడుకు సినిమాలో అంతగా అవకాశాలు రావడం లేదు. కారణమేంటో తెలియదు కానీ ఇప్పటికీ ఈ భామ ఆఫర్స్ కోసం తిప్పలు పడుతూనే ఉంది. ఇక యాంకర్ గా ఆఫర్లు రానప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కాస్త బిజీగానే ఉంది.

రీసెంట్ గా విష్ణు ప్రియ వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఐటమ్ సాంగ్ లో తన అందాన్ని ఎక్స్పోజ్ చేస్తూఅదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది విష్ణు ప్రియ. తనకు హీరో అఖిల్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పింది. అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటూ డైరెక్టర్లను రిక్వెస్ట్ చేస్తుంది. తనకు అఖిల్ తో జన్మజన్మల అనుబంధం ఉందని చెప్పింది. అఖిల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరింది.

Vishnu Priya : హీరో అఖిల్ తో ఒక్కసారి అంటూ కామెంట్స్…

Anchor Vishnu Priya open comments about hero akhil
Anchor Vishnu Priya open comments about hero akhil

అక్కడితో ఆగకుండా అఖిల్ తో డాన్స్ చేసే ఒక ఛాన్స్ ఇప్పించాలంటూ చేతులు జోడించి మరి వేడుకుంది. విష్ణు ప్రియ యాంకర్ అయినప్పటికీ చాలాసార్లు ఇంటర్వ్యూలలో తాను హీరో అఖిల్ కు వీరాభిమాని అని చెబుతుంది. అంతేకాకుండా అఖిల్ సినిమాలు వచ్చిన, బర్త్ డే వచ్చిన అతడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. విష్ణుప్రియ అంతలా వేడుకుంటుంది మరి డైరెక్టర్లు అఖిల్ తో ఒక ఛాన్స్ ఇప్పిస్తారో లేదో చూడాలి.