Rashmika : హీరోయిన్ రష్మిక తెలుగులో ‘ ఛలో ‘ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో తర్వాత విజయ్ దేవరకొండ తో ‘ గీతగోవిందం ‘ సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది రష్మిక. అంతేకాదు ఎవరు అనుకోని విధంగా మొదటి సినిమాకి మూడవ సినిమాకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంది. తక్కువ టైంలోనే తెలుగు, తమిళ్, హిందీ లో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరింది.
Rashmika : హాస్పిటల్లో చేరిన రష్మిక మందన్నా…

అంతేకాదు ప్రస్తుతం రష్మిక సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. అయితే రష్మిక మొదట నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంది. అలాగే అల్లు అర్జున్ కూడా నాచురల్ గా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా పుష్ప సినిమాలో నా సామి సామి అంటూ అదిరిపోయి స్టెప్స్ వేసి కుర్రకారును ఫిదా చేసింది. అంతవరకు బాగానే ఉన్నా ఆ పాటలో సినిమా హిట్ అవ్వాలని రష్మిక నడుముని గిరగిర తిప్పేసి స్టెప్పులు వేసింది

ఇప్పుడు అమ్మడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ కు వెళ్ళిందంట. సామీ సామి పాటలు స్టెప్ వేసిన కారణంగా మోకాళ్లు నొప్పులు వచ్చాయంట. దాంతో ఆమె హాస్పిటల్ కి వెళ్ళిందంట. ఇదే విషయాన్ని డాక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నువ్వు సామీ సామి అంటూ మోకాళ్ళ మీద బరువు అంతా వేసి డాన్స్ చేయడం వల్ల మీకు ఇలా నొప్పులు వచ్చాయి అంటూ కామెడీగా పెట్టారు. అంతే కాదు త్వరలోనే బన్నీ కూడా షోల్డర్ పెయిన్ తో నా దగ్గరికి వస్తాడేమో అంటూ సరదాగా కామెంట్ పెట్టారు. దీంతో ఆ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది