Viral Video : 24 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తి గిన్నిస్ రికార్డు సృష్టించిన రోబో.. ఎలా సాధ్యమైందంటే?

Viral Video : సాధారణంగా మనుషులు అయితే ఏవైనా రికార్డులను బ్రేక్ చేస్తారు. గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధిస్తారు. కానీ.. ఒక రోబో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధిస్తే ఎలా ఉంటుంది. అదే విచిత్రం కదా. నిజానికి ప్రస్తుతం రోబోలు కూడా చాలా ముందడుగు వేస్తున్నాయి. రోబో టెక్నాలజీ విస్తరిస్తోంది. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని రోబో టెక్నాలజీ కూడా ప్రపంచ వ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం మనుషులకు ఉపయోగపడే పలు రోబోలను సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు.

robot runs 100 meters in 24 seconds and breaks guinness world record
robot runs 100 meters in 24 seconds and breaks guinness world record

ఈనేపథ్యంలో ఓ రోబో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ రోబో ఏం చేసింది.. అది వరల్డ్ రికార్డు ఎలా సాధించింది అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. రెండు కాళ్లు ఉన్న ఓ రోబో.. 100 మీటర్ల దూరాన్ని కేవలం 24.73 సెకన్లలో పూర్తి చేసింది. ఇది రోబో క్రియేట్ చేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్.

Viral Video : మిషన్ లర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ ద్వారా రోబోను డెవలప్ చేసిన యూనివర్సిటీ బృందం

ఈ రోబో పేరు కాసీ. దీన్ని వోఎస్ యూ స్పిన్ ఆఫ్ కంపెనీ అజిలిటీ రోబోటిక్స్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఆస్ట్రిచ్ పక్షిని పోలిన కాళ్లకు ఆ రోబోకు అమర్చి.. దానికి పరుగుపందెం పెట్టారు. దీంతో అది పరుగుపందెంలో విజయం సాధించింది. 100 మీటర్ల పరుగుపందాన్ని గెలిచి అది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. 2021 లోనే ఈ రోబో 53 నిమిషాల్లో 5 కిలోమీటర్ల దూరం పరిగెత్తి రికార్డు సాధించింది. తాజాగా 2022 లో 100 మీటర్ల దూరాన్ని 24 సెకన్లలో పూర్తి చేసి మరో రికార్డు క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.