Vastu tips for Diwali : దీపావళి శుభ ముహూర్తం, పండగ తేదీ… లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు.

Vastu tips for Diwali :  మన తెలుగు సంప్రదాయం ప్రకారం పండగ అనగానే ఇల్లంతా శుభ్రపరిచి ఇంటికి మామిడి ఆకులను పువ్వులను అమ్మర్చుకుంటారు. పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం సొంతం చేసుకుంటుందని భక్తుల నమ్మకం. ఈ పండుగ రోజున దీపాలు వెలిగించి, కొత్త బట్టలను ధరించి, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలవడం చేస్తారు. అంతేకాకుండా దీపావళి పండుగ రోజున ఆనందం, సంపద శ్రేయస్సు, ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు.

ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 24న జరుపుకుంటున్నారు. ఈ పండగ రోజున పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. పూలతో, మామిడి ఆకులతో అందంగా అలంకరిస్తారు. ఇటువంటి ఇంటిని లక్ష్మీదేవి సొంతం చేసుకుంటుందని భక్తుల నమ్మకం. ఏడాది దీపావళి పర్వదినం జరుపుకునే తేదీ, ముహూర్తం వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.

Vastu tips for Diwali : లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని నియమాలు.

Diwali Greetings Muhurtam Festival Date Few Rules While Worshiping Goddess Lakshmi
Diwali Greetings Muhurtam Festival Date Few Rules While Worshiping Goddess Lakshmi

లక్ష్మీదేవి పూజకు తేదీ, సమయం, ముహూర్తం
తేదీ: 24 అక్టోబర్ 2002

రోజు: సోమవారం
సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు లక్ష్మీ పూజ ప్రారంభం
సాయంత్రం 6.51 నిమిషాలకు లక్ష్మీ పూజ ముగింపు

ముగ్గులు అందమైన పూజ మండపాలు: ప్రతి ఇంటిని లైట్లు పువ్వులు ముగ్గులు, కొవ్వొత్తులు గులాబీ రేకులు ఇతర అలంకార వస్తువులతో అలంకరించండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించండి. లక్ష్మీదేవికి అందమైన ముగ్గులు సంతోషాన్ని ఇస్తాయి. ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక్ తో పాటు విరువైపుల శుభం లాభం అని రాయండి.

ఇంటిని శుభ్రపరచడం: దీపావళికి శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇల్లు ఆఫీసు లేదా మీరు తరచుగా వెళ్లే ఏదైనా ఇతర ప్రదేశాలు అనుకూల శక్తి ప్రవహించేలా చేయడానికి అత్యంత ముఖ్యమైన కార్యకలాపం. ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ ఇంటి ప్రతి మూలాన శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీరు వంటగది. స్టోర్ రూమ్ ని తగిన విధంగా శుభ్రం చేసుకోవాలఇంట్లో విరిగిన వస్తువులను వదిలేయించుకోండి: వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లో ఉపయోగించని, అద్దాలు , ఎలక్ట్రిక్నిక్స్, బొమ్మలు, మరియు ఇతర వస్తువులను పడి వేయండి.

ఇంటి ఉత్తర విభాగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వండి: మీ ఇంట్లోనే ఉత్తర కుబేర స్థానం. మీ ఇంటికి ఉత్తర, ఈశాన్యం దిశలను చక్కగా, పరిశుభ్రంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా, అందంగా ఉంచడం చాలా కీలకం. మీ బ్రహ్మస్థానాన్ని శుభ్రంగా ఉంచండి. ఇంటి ఉత్తర దిశలో ఎలాంటి వాస్తు దోషాలు లేవని నిర్ధారించుకోండి. ఈ ప్రాంతంలో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉంటే ఆదాయాన్ని కోల్పోతాయి