Veerayya Teaser : వీరయ్య మీద అంచనాలు మరింత పెంచేసిన టీజర్!! పండగ చేసుకుంటున్న చిరు ఫ్యాన్స్!!

Veerayya Teaser : మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం 154వ మూవీ వాల్తేరు వీరయ్య పై పెట్టుకున్న అంచనాలు గురించి తెలియజేయాల్సిన అవసరం లేదు. మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందే తన అభిమానం అంతా మూవీపై పెడుతున్నానని దర్శకుడు బాబి ప్రామిస్ చేశాడు. అదే మాటని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చిరంజీవి సైతం ఊర మాస్ పాత్రలు చేస్తున్నట్లు కొన్ని సంవత్సరాల తర్వాత అటువంటి ఆహార్యంలో కనబడడంతో ఎంతో ఉత్సాహాన్ని పెంచేస్తుంది.

Little fans are celebrating the teaser that has increased expectations on Veeraya..!!
Little fans are celebrating the teaser that has increased expectations on Veeraya..!!

ఇక దాంతో మూవీ పై అంచనాలు ఒక లెవెల్ కి చేరుతున్నాయి. ఇంకోవైపు బాబి.. ఒకవైపు చిరు.. అంతా నమ్మకంగా కనపడ పోవడంతో మూవీ విషయం ఏంటో తెలుసుకోవాలని మూవీ గోయర్స్ లోను ఆసక్తి నెలకొంది. మరి ఆ మాటని ఎంత మేరకు నిలబెడతాడు అన్నది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అంతకుముందు టీజర్ శాంపిల్స్ మాత్రం ప్రేక్షకులలో ఎనర్జీ తెప్పిస్తోంది. దీపావళి సందర్భంగా కొద్దిసేపటి క్రితమే ఉంది. “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్ ని విడుదల చేశారు. టీజర్ అత్యంత మాస్ కోణంలో ముంచేశారు. విడుదల కి ముందే టైటిల్ టీజర్ తోనే బాబిలో మాస్ మా యాంగిల్ ఎలా ఉన్నది అనేది బాగా కనిపిస్తుంది. ఏంట్రా బాబు అక్కడేమో ఎనర్జీ తెప్పిస్తోంది అన్నారు. అడుగుపెడితే అరాచకం అంటున్నారు. ఎవడ్రా మీ అన్నయ్య సౌండ్ లేదు అని వాల్తేర్ మాస్ బ్యాచ్ అనగా.. ఏకంగా విధ్వంసం తోనే వీరయ్య రంగంలోకి ఎంట్రీ ఇస్తుంటే… అభిమానులు పూనకాలు తద్యం..

అన్నయ్య అడుగుపెడితే అరాచకమైన అని తెలుస్తోంది. సౌండ్ కాదు.. రీ సౌండ్ దద్దరిల్లాల్సిందే.. ఉండదని చూపించారు. ఇక వీరయ్య మాస్ లుక్కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు కంటే ఊర మాస్ లుక్కు డబల్ కి ఎక్కువే కనబడుతోంది. లుంగీ, గళ్ళ చొక్కా, నోట్లో బీడీ, ముక్కు నుంచి పొగ వచ్చే తీరు.. చెవికి పోగు, మెడలో బంగారు గొలుసులు ఇక ఇలా వీరయ్యని ఒక రేంజ్ లో వెల్వెట్ చేసి చూపిస్తున్నారు. మెగాస్టార్ మాస్ వాక్ ఇక అరాచకమే..
ఇటువంటి ఎంటర్టైనింగ్ ధమాకా ఇంకా చూడాలనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటూ.. చిరు ఇచ్చిన డైలాగ్ అభిమానిని అట్రాక్ట్ చేస్తోంది. దీపావళి మోత కొన్ని గంటల మునిపే మొదలైంది. టైటిల్ టీజర్ ని ఈ లెవెల్ లో ఉందంటే అసలు టీజర్ ఆ తదుపరి విడుదల అయ్యే ట్రైలర్ ఇంకే లెవెల్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు…