Business Idea : ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలంతా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల అమ్మకాలు బాగా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి అనుకూలంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సైతం రెట్టింపు అవుతుంది. అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు దృష్టిపెట్టాయి. కేవలం స్కూటర్లు మాత్రమే కాదు ఫోర్ వీలర్స్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మారుతి సుజుకి, కియా, టయోటా, వంటి ఈ టాప్ కార్ తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశించాయి ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ట్రక్కులు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి కూడా.
విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలను వ్యవసాయ అవసరాలు కోసం ఉపయోగించే ట్రాక్టర్స్, ట్రక్ మేకర్స్ రంగం సిద్ధం చేశాయి. క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ను మరింత ప్రోత్సహించేలా అటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలను తీసుకుంటుంది. ఇందులో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల వస్తు సేవా పన్నులను తగ్గించాలని భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం లిథియం అయాన్ బ్యాటరీలపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీల తయారీని మరి చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే దానికి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావడం తప్పనిసరి.
నగరాలు, పట్టణాలు, గ్రామాలు, జాతీయ రహదారుల వెంట పెట్రోల్ బంకుల తరహాలోనే ఈవీ చార్జింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి అందుబాటులో ఉంటేనే కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతారు. ఈ పరిస్థితుల మధ్య ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పడం ద్వారా ప్రతినెల లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఒక ఛార్జింగ్ స్టేషను పెట్టడానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్ష నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. దీనికి వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పది చదరపు అడుగుల స్థలంలో ఈ పాయింట్ను అమర్చుకోవచ్చు. పెద్దగా ప్లేస్ కూడా అవసరం లేదు. వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని చూపించాలి. దీన్ని పెట్టడానికి లైసెన్స్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిపై పెద్దగా కండిషన్స్ ఏమి పెట్టలేదు.