Hindus tradition : హిందూ మతంలో ఆచారాలు, విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయి. చాలామందికి వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ పెద్దలు చెప్పిన వాటిని పాటిస్తూ ఉంటారు. కొందరేమో వాటిని మూఢనమ్మకాలు అనుకుంటారు .వాటిని పాటించకూడదు అనుకుంటారు. అయితే ప్రతి ఆచారానికి ఒక కారణం ఉంటుంది. సాధారణంగా సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసం తినే హిందువులు చాలామంది మటన్, చికెన్, చేపలు, గుడ్లు తినరు. అలాగే ఏకాదశి, పండుగలు, పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో నాన్ వెజ్ తినడం మానేస్తారు.

హిందూ మతం ఒక జంతువును చంపటం లేదా ప్రాణాన్ని తీసుకోవడం పాపమని చెబుతోంది. అంతేకాదు ఇలా ఆరోజు ఈరోజు తినకూడదని చెప్పడం వలన జంతువును చంపడం కాస్తయినా తగ్గుతుందని వారి నమ్మకం. అందుకే అలా చెబుతుంటారు. అలా లేకపోతే చాలామంది ప్రతి రోజు మాంసాహారం తింటారు. ఇలా ఎక్కువగా మాంసాహారం తినడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతోంది. కొవ్వు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. గుండె సమస్యలు, పెద్ద ప్రేగు క్యాన్సర్, రక్తపోటు, కిడ్నీలో రాళ్లు మొదలగు అనారోగ్య సమస్యలు వస్తాయి.
అలాగే శరీర పోషణకు కొద్దిపాటి మాంసం మాత్రమే సరిపోతుంది. ఎక్కువగా తీనడం వలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే సోమ, మంగళ, గురు, శనివారాలు కొన్ని దేవుళ్లకు సంబంధించిన మతపరమైన విధిని పెట్టారు. దేవుడి పేరు చెబితే తినకుండా ఉంటారని అలా చెప్పడం మొదలుపెట్టారు. మొత్తానికి వారానికి ఒకసారి నాన్ వెజ్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మాంసాహారం తిన్నవారికంటే శాఖాహారులు 10 సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.