Vastu Tips For Home : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించకపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కొన్ని సందర్భాలలో పాటించినప్పటికీ ఈ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఇంట్లో ని వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో సానుకూలత మరియు ఆర్థిక శ్రేయస్సు కావాలంటే ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావాలని అలాగే కొన్ని వస్తువులను దూరంగా ఉంచాలని శాస్త్రం చెబుతోంది. అయితే ఇంట్లో సంతోషకరమైన వాతావరణ కోసం వాస్తు శాస్త్రం సూచించే మరొక విషయం ఏమిటంటే ఇంట్లోని కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచకూడదట. కొన్ని రకాల వస్తువులను ఖాళీగా ఉంచడం వలన కుటుంబ సభ్యులకు హాని కలుగుతుందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇంట్లో ఎప్పుడు ఖాళీ ఉంచకోడని వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కల కుండీలు…
చాలామంది ఇంట్లో మొక్కలను పెంచేందుకు కుండీలను ఉపయోగిస్తారు. అంతేకాక అలంకరణ కోసం అంటూ గిన్నెలో రకరకాల పువ్వులతో అలంకరించడం కూడా ప్రతి ఇంట్లో చూస్తున్నాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఖాళీ కుండీలు భావోద్వేగా కనెక్షన్లు నెరవేరిన సంబంధాన్ని శూన్యాన్ని సూచిస్తుంది. కావున మీ ఇంట్లో కుండీలు ఖాళీగా ఉన్నట్లయితే వెంటనే వాటిని మొక్కలతో నింపండి. లేకుంటే కుటుంబంలో సానుకూలత, ప్రేమ మరియు బలమైన సంబంధాలను కొనసాగించలేరు.
పూజ గదిలో పంచ పాత్ర….
ప్రతి ఇంట్లో పూజకు సంబంధించిన వస్తువులన్నీ పూజ గదిలోనే ఉంచుతారు. అయితే పూజ గదిలో ఉంచే పంచ పాత్ర ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. పూజా సమయంలో పంచ పాత్రలో శుభ్రమైన నీరు పోసి తులసీ లేదా పూలు వేసి ఉంచాలి. ఇలా పంచ పాత్రను ఎప్పుడూ నిండుగానే ఉంచాలి. నీరు లేకుండా పంచ పాత్రను అసలు ఖాళీగా ఉంచకూడదు. పంచ పాత్రను ఖాళీగా ఉంచినట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, ఆర్థిక నష్టాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.
బియ్యం పాత్ర….
ప్రతి ఇంట్లో బియ్యం నిల్వ చేసుకునేందుకు ఒక పాత్రను ఉపయోగిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పాత్రను ఎప్పుడు ఖాళీ చేయరాదు. ఒకవేళ బియ్యం అయిపోయినట్లయితే పాత్రలో కనీసం పిరికిడు బియ్యం గింజలు ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ధాన్యం నిలువ చేసుకునే పాత్రలో జీవితానికి శక్తిని శ్రేయస్సును ఇస్తాయని విశ్వాసం. అందుకే వాటిని ఎప్పుడూ ఖాళీ చేయరాదు.
పర్స్ ….
పర్సు అనేది ఆర్థిక శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఖాళీ పర్స్ ఆర్థిక ఇబ్బందిని సూచిస్తుంది. అందుకే ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరుచుకునేందుకు వాలెట్లో ఎప్పుడు కొంత డబ్బులు ఉంచుకోవడం మంచిది.
గమనిక : పైన పేర్కొనబడిన అంశాన్ని వాస్తు శాస్త్ర నిపుణుల అంచనాల మేరకు రూపొందించడం జరిగింది. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.