Pooja Tips : మన హిందూ ధర్మంలో దేవునికి పూజ చేసేటప్పుడు వివిధ రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. దేవుడికి ఇష్టమైన, ప్రీతికరమైన పదార్థాలతో పూజిస్తే దేవుడు కరుణిస్తాడని నమ్మకం. అలా ఉపయోగించే వాటిలో ఒకటి తమలపాకు. చాలామంది తమలపాకులను తినడానికి వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కానీ దీనిని దేవతలను పూజించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. దేవుడిని పూజించడం వలన మన ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయని నమ్మకం.
ఆంజనేయస్వామికి తమలపాకుల అంటే ఎంతో ప్రీతికరం. మంగళవారం లేదా శనివారం నాడు తమలపాకులతో హనుమంతుడిని పూజిస్తే మనం అనుకున్న పనులు జరుగుతాయి. దీనితోపాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే తమలపాకులను తినడం వలన ఎటువంటి వ్యాధులు దరిచేరవు. ఈ తమలపాకులను తింటే శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా ఉంటారు. మీరు మీ ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడు తమలపాకుపై కొద్దిగా కుంకుమ వేసి వినాయకుడికి సమర్పించండి.
Pooja Tips : తమలపాకులతో ఇలా చేస్తే… ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి

ఇలా చేయడం వలన గణేశుడు సంతోషిస్తాడు. అలాగే జీవితంలో ఎటువంటి కష్టాలనైనా తొలగిస్తాడు. అంతేకాకుండా ఏ కార్యానికి ఆటంకాలు ఏర్పడవు. అలాగే ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడాలంటే తమలపాకులను ప్రధాన ద్వారం పై ప్రతిరోజు వేలాడదీయాలి. ఇలా చేయడంవలన మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులనే ఉపయోగించాలి. తమలపాకులను ఎప్పుడు రెండుగా చేర్చకూడదు. ఇలా చేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయి.