Health benefits : ఈ తరంవారు తమ శరీరాన్ని ఫిట్ గా ఎలా ఉంచుకోవాలని ఆలోచిస్తుంటారు. ప్రతిరోజు బాడీ ఫిట్ నెస్ కోసం బలమైన ఆహార పదార్థాలను తింటూ, వివిధ రకాల వ్యాయామాలను చేస్తూ ఉంటారు. కానీ ఫిట్ నెస్ కోసం రోజు వాకింగ్ చేయాలి. ఎంత దూరం వాకింగ్ చేస్తే మీ శరీరానికి అంత మంచిది. మీకు శక్తి ఉన్నంతవరకూ ఎంత దూరమైన వాకింగ్ చేయొచ్చు. అలాగే ప్రతి రోజు వాకింగ్ చేయడం వలన బాడీ ఫిట్ నెస్ నే కాదు ఆరోగ్యపరంగా కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడిస్తే బాడీ మంచిగా ఉంటుందో తెలుసుకుందాం..
బాడీ ఫిట్ గా ఉండేందుకు పెద్దవారు అయితే సుమారు 1000 అడుగులు నడవాలి. అంటే ప్రతి రోజు దాదాపుగా 8 కిలోమీటర్లు నడవాలి. మీకు మీ బాడీలో శక్తి ఉన్నంతవరకు ఈ దూరం ఇంకా పెంచుకోవచ్చు. ఇంత దూరం నడవలేము అనుకున్న వారు ఈ సామర్థ్యాన్ని బట్టి నడవండి. ప్రతిరోజు నడవడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది. అలాగే నడక అనేది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు ప్రతి రోజు 8 కిలోమీటర్లు నడవడం వలన సులువుగా బరువు తగ్గవచ్చు. ప్రతిరోజు నడవడం అనే వ్యాయామాన్ని అలవాటు చేసుకోండి. మీ శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
Health benefits : బాడీ ఫిట్ నెస్ కోసం రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవాలో తెలుసా…?

వాకింగ్ వలన ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు వాకింగ్ చేయడం వలన కండరాలను బలంగా తయారు చేసుకోవచ్చు. అలాగే మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అంతేకాకుండా, ప్రతి రోజు వాకింగ్ చేయడం వలన వృద్ధులలో కీళ్లు గట్టిగా, బలంగా తయారవుతాయి. అలాగే పొట్ట ఎక్కువగా ఉన్నవారు రోజూ వాకింగ్ చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎముకల వ్యాధి మరియు జ్ఞాపక శక్తిని కోల్పోవడం లాంటి సమస్యలు తలెత్తవు. అందుకే ప్రతిరోజు వాకింగ్ చేస్తే ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉంటాయి. వీలైనంత వరకు 8 కిలోమీటర్ల దూరం వరకు నడవగలిగితే మంచిది. చదునైనా ఉపరితలం మీద నడవటం కంటే ఎత్తులో నడవటం వలన కండరాలు మూడు రెట్లు ఎక్కువ ప్రయోజనం పొందుతాయి. కనుక మరిన్ని ప్రయోజనాల కోసం మెట్లు కూడా ఎక్కవచ్చు. ఒకవేళ మీరు ఏ వ్యాధితో అయినా బాధపడుతూ ఉన్నట్లయితే అలా చేయటానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.