TTD : కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం భక్తులు ఎంతోమంది దర్శించుకోవడానికి తిరుమల వెళుతుంటారు. వడ్డీ కాసులవాడిని దర్శించుకోవడానికి ప్రజలు ఎంత కష్టమైనా వెళుతుంటారు. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఎంతోమంది వస్తున్నారు. తమ కష్టాలని తీర్చమని ఆ దేవుడిని వేడుకుంటారు. వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు తమ సామర్థ్యం కొద్ది హుండీలో ఎంతో కొంత ధనాన్ని వేస్తారు. తిరుమల ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అయితే కొన్నిసార్లు శ్రీవారి ఆలయాలు మూసివేయాల్సి వస్తుంటుంది. ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆలయాన్ని మూసివేయాలను కుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 24న దీపావళి కాగా, అక్టోబర్ 25న సూర్యగ్రహణం ఉండగా, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో శ్రీవారి దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అక్టోబర్ 24 న దీపావళి కారణంగా దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి అధికారులు తెలిపారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి రాత్రి 7:30 గంటల వరకు అంటే దాదాపుగా 12 గంటలు శ్రీవారి ఆలయా తలుపులు మూసి వేయబడతాయట. దీని కారణంగా శ్రీవారి దర్శనం రద్దు చేసినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని క్లారిటీ ఇచ్చేశారు.
నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8:30 నుంచి రాత్రి దాదాపుగా 7:30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయబడతాయని తెలిపింది. దీంతో శ్రీవారి దర్శనానికి బ్రేక్ పడినట్లే అని తెలిపింది. నవంబర్ 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడడం లేదని తెలిపారు. అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం రోజుల్లో శ్రీవారి 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం కి సహకరించాలని కోరారు. ఎవరైనా శ్రీవారి భక్తులు తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ఈ మూడు రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. భక్తులు కూడా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించే వార్తలను కచ్చితంగా చూసుకోవాలి. లేదంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బందులు పడుతారు.