Business Idea : ఇంతకంటే బెస్ట్ బిజినెస్ ఐడియా ఉండదు… వెంటనే ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి!

Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటివారు ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటి వారికోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందగలిగే ఓ బిజినెస్ ఉంది. అదే ఫ్లై యాష్ బ్రిక్స్ బిజినెస్. బూడిదతో తయారు చేయబడిన ఇటుకలకు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. రాబోయే కాలంలో దీనికి భారీగా డిమాండ్ పెరగబోతుంది. ఇప్పుడు ఉన్న పట్టణీకరణ యుగంలో బిల్డర్లు బూడిదతో చేసిన ఇటుకలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి 100 గజాల స్థలంతో పాటు కనీసం రెండు లక్షల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ చేయడం ద్వారా ప్రతి నెలా లక్ష వరకు సంపాదించవచ్చు.

Business ideas do bricks business get best profit
Business ideas do bricks business get best profit

ఈ ఇటుకలను పవర్ ప్లాంట్ల నుండి బూడిద, సిమెంట్ మరియు రాతి ధూళి మిశ్రమం నుండి తయారుచేస్తారు. ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ యంత్రానికి 100 గజాల స్థలం అవసరం. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. యంత్రాన్ని నడపడానికి 5 నుంచి 6 మంది వ్యక్తులు అవసరం. ఈ యంత్రంతో రోజుకు దాదాపుగా 3 వేల ఇటుకలను తయారు చేయవచ్చు. ఒకవేళ మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉంటే ఆటోమేటిక్ మిషన్ కూడా అమర్చుకోవచ్చు. ఆటోమేటిక్ మిషన్ ధర పది నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ముడి సరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు మంత్రం ద్వారా అన్ని పనులు జరుగుతాయి.

ఆటోమేటిక్ మిషన్ గంటలో వెయ్యి ఇటుకల తయారు చేస్తుంది. ఈ విధంగా ఒక నెలలో మూడు నుండి నాలుగు లక్షల ఇటుకల ఈజీగా తయారు చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో మట్టి లేని కారణంగా ఇటుకలు తయారు చేయడం లేదు. హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ నుంచి ఇక్కడికి ఇటుకలు దిగుమతి అవుతాయి. ఇటువంటి సమయంలో బూడిద, సిమెంటు, రాళ్లపొడితో తయారు చేసిన ఇటుకలను అటువంటి ప్రాంతాలలో అమ్మె అవకాశం ఎక్కువగా ఉంది. మాన్యువల్ యంత్రాన్ని అమర్చడం ద్వారా నెలకు 300వేల వరకు ఇటుకలను తయారు చేయవచ్చు. దీంతో నెలకు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం ఈ బిజినెస్ ద్వారా పొందవచ్చు.