Pooja tips : ప్రతి ఒక్కరు పూజ చేసే సమయంలో ఏ భగవంతుడికి అయినా పువ్వులను సమర్పిస్తారు. ఈ ఆచారం పురాతన కాలం నుంచి వస్తుంది. అయితే ఈ పువ్వులు కచ్చితంగా దేవునికి ఎందుకు సమర్పించాలి ? వాటి వల్ల మనకు కలిగే లాభాలేంటి అనే విషయాలు చాలామందికి తెలియదు. భక్తిశ్రద్ధలతో, పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే దేవునికి పువ్వును గాని, పండ్లను గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తితో విందు ఆరగిస్తాను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తన అర్చన విధానంలో పువ్వులను చేర్చాడంటే దేవతరాధనలో పువ్వులు పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. అందువలన ప్రతి ఒక్క పూజలో పువ్వులు తప్పనిసరిగా వినియోగిస్తారు.
అయితే భగవంతుడికి సమర్పించే పువ్వు ఏదైనా శుచి, శుభ్రతతో కూడుకున్నదై ఉండాలి. మైల వారు, బహిష్టులైన స్త్రీలు, పురిటి వారు పువ్వులను అసలు తాకకూడదు. అలాంటివి పూజకు వినియోగించరాదు. అలాగే నేలపై పడ్డ పువ్వులను, వాసన చూసినా పువ్వులు పూజకు పనికిరావు. శుభ్రంగా స్నానం ఆచరించిన తర్వాతనే పువ్వులను కోసి దేవుని పూజలో ఉపయోగించాలి. వాడిపోయినవి ,ముళ్ళు ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమైనవి
దైవ పూజలో వినియోగించకూడదు. తామర పువ్వులు, కల్వ పువ్వులు, జాజులు, కనకాంబరాలు నీలాంబరాలు, చామంతి, నందివర్ధములు, పారిజాతాలు, ఎర్రగన్నేరు, మందారం, మంకెన,మునుగోరింట, గరుడవర్ధనం, మాలతి, నిత్యమల్లి వంటి పువ్వులను దేవుని పూజకు పవిత్రమైనవిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే కంఠాన గంధాన్ని, చెవిలో పువ్వును ధరించాలి. జుట్టు మూడిలో తులసి దళాన్ని ధరించకూడదు.
Pooja tips : పూజ చేసేటప్పుడు దేవునికి పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా.?

విష్ణు భగవానుడిని తులసి దళాలతో, సూర్యనారాయణుడిని, వినాయకుడిని తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించాలి. అలాగే లక్ష్మీదేవిని తామర పువ్వులతో, గాయత్రీ దేవిని మల్లికా, పొగడ, కుశ మంజరి, మందార, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక పువ్వులతో పూజించాలి. అలాగే శ్రీ చక్రాన్ని తామర పువ్వులు, తులసి దళాలు, కల్వపూలు, జాజి,మల్లె ఎర్రగన్నేరు, ఎర్రకాలువ పువ్వులు, గురువింద పువ్వులతో పూజించాలి. అలాగే పరమేశ్వరుడుని మారేడు దళాలతో పూజించడం వలన శివుడు తృప్తి చెంది కోరిన వరాలను నెరవేరుస్తాడు. అలాగే పవళ మల్లె పువ్వులతో పూజిస్తే మంచి కోరికలు, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. లక్ష్మీదేవికి ఎర్ర పూలు అంటే ప్రీతికరం. ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని కొలిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.