Intinti Gruhalakshmi 9 July Today Episode : భాగ్య సంగీతం కాంపిటీషన్ బయట వచ్చి నిలబడి ఈ లాస్య ఎక్కడికి వెళ్లింది అని ఆలోచిస్తూ వుండగానే లాస్య వస్తుంది అక్కడికి అప్పుడు భాగ్య ఎక్కడికి వెళ్లావు లాస్య, బావగారు ఇoతసేపు కంగారు పడుతున్నారు అని అనగానే అప్పుడు లాస్య కంగారుపడవలసినది నందు కాదు తులసి, తులసి ప్రేమ్ నందుని ఎగతాళి చేసినట్లు మాట్లాడారు వాళ్ళకి నేను బుద్ది చెప్పాలి అని అంటుంది, అప్పుడు భాగ్య మొన్నే కదా తులసి చేత చెంప దెబ్బ తిన్నది కాస్త గ్యాప్ తీసుకో అంటోంది అప్పుడు లాస్య గ్యాప్ తీసుకోవాల్సి౦ది మనము కాదు ఆ తల్లి కొడుకుల మధ్య గ్యాప్ ని పెంచాలి అని అంటుంది.
అప్పుడు భాగ్య మనసులో ఇది మళ్ళీ ఏదో తింగిరి పనిచేసి నన్ను ఇరికించేలా గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత లాస్య ఒక టానిక్ బాటిల్ ని చూపిస్తుంది, ఇదీ ఎలాగైనా ప్రేమ్ తాగేలా చెయ్యాలి అని అంటుంది. లాస్య జ్యూస్ లో టానిక్ ని కలిపి ఆ గ్లాస్ ని వెయిటర్ కి ఇచ్చి అక్కడ ఉన్న ప్రేమ్ కి ఇవ్వమని చెబుతోంది తరువాత లాస్య భాగ్యతో అది తాగాక మొదటి రౌండ్లో ప్రేమ్కి దగ్గు మొదలవుతుంది తరువాత పాడలేకపోతాడు, అప్పుడు తులసి కంగారుపడుతోంది, తరువాత తులసి ని నమ్మి ప్రేమ్ కి అవకాశం ఇచ్చిన సంజన టెన్షన్ పడుతుంది అప్పుడు తులసి పరువు పోతుంది , అప్పుడు తులసి కోపంతో ప్రేమ్ ని వదిలిపెడుతుంది అని అంటుంది.
Intinti Gruhalakshmi 9 July Today Episode : లాస్య కుట్ర ని తిప్పికొట్టిన తులసి

ప్రేమ్ ఆ గ్లాసులో వున్న జ్యూస్ తాగుతాడు,తరువాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది గెలిచిన వారికి అయిదు లక్షలు ఇస్తారు అని ప్రకటించి, పోటీని మొదలు పెడదాం అని అందరినీ పిలుస్తారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి పాట పాడుతూ ఉంటారు, ఇంతలో ప్రేమ్ కి దగ్గు మొదలవుతుంది అది గమనించిన తులసి ప్రేమ్ దగ్గరికి వెళ్లి ఏమైంది ప్రేమ్ అని అడగ్గానే ఎందుకో తెలియదు అమ్మ ఇబ్బందిగా ఉంది గొంతులో అని, పాడటం ఇబ్బంది అవుతుందో ఏమో అమ్మ అని అంటాడు, అప్పుడు తులసి ఏమీకాదు ప్రేమ్ ధ్యాసంతా పాట మీద పెట్టు ఏమీకాదు ఎలాగైనా గెలవాలి అని చెప్పి వేడి నీళ్లు తాగమని ఇస్తుంది.
లవంగం ఇచ్చి దానిని బుగ్గలో పెట్టుకోమని గొంతునొప్పి తగ్గుతుంది అని చెప్పి ఇస్తుంది.తర్వాత ప్రేమ్ ని పాట పాడడానికి స్టేజ్ మీదికి పిలుస్తారు, ప్రేమ్ పాట చాలా బాగా పాడుతాడు, అందరూ చప్పట్లు కొడతారు అప్పుడు లాస్యకి దగ్గు మొదలవుతుంది అప్పుడు నందు ఏమైంది లాస్య అని అడుగుతాడు అప్పుడు లాస్య అక్కడినుండి వెళ్లిపోతుంది సమాధానం చెప్పకుండా, మొదటి రౌండ్లో గెలిచిన వారి పేర్లలో ప్రేమ్ పేరు కూడా ఉండటంతో అందరూ సంతోషపడతారు. దగ్గుతూ బయటికి వచ్చిన లాస్య దగ్గరికి భాగ్య వచ్చి ఏంటీ లాస్య ప్రేమ్ కి దగ్గు వచ్చేలా చేస్తానని నువ్వు తెచ్చుకున్నావు అని అనగానే తులసి వచ్చి తను కాదు నేనే అలా చేశాను అని జరిగింది చెబుతుంది
ప్రేమ్ కి గ్లాస్ ఇవ్వడాన్ని గమనించిన తులసి లాస్య ఏదో కుట్ర చేస్తుందని ఊహించి ఆ గ్లాస్ ని మార్చి అదే గ్లాస్ ని లాస్య తాగేలాగా చేస్తుంది. నువ్వు నా జోలికి వస్తేనే నేను నిన్ను రోడ్డుమీద పరుగెత్తించా నున్న పిల్లల జోలికి వస్తే నేను ఊరుకుంటానా అని, తులసి ఆకులను తీసుకొని వచ్చి నువ్వు ఈ తులసికి చెడు చేయాలి అనుకున్నావు కానీ ఈ తులసి మంచే చేస్తుంది అని తులసి ఆకులను గొంతులో వేసుకొ దగ్గు తగ్గుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. లాస్య ఆ తులసి ఆకులను తిని, ఎలాగైనా ప్రేమ్ కి ఓట్లు పడకుండా చేయాలి అని కుట్రచేస్తుంది మళ్లీ. తరువాత తులసి, కుటుంబం అందరూ ప్రేమ్ ని ఎలాగెైనా గెలిచి మన కుటుంబం తల ఎత్తుకునేలా చెయ్యాలి అని చెపుతూ ఉంటారు
ఇంతలో నందు లాస్యని నువ్వు భాగ్య ఆడియన్స్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నారు అని అడగ్గానే, లాస్య రక్షిత్ కి ఓటు వేసి గెలిపించామని అడగడానికి వెళ్లాము అని అంటుంది అప్పుడు నందు ఎందుకు లాస్య అలా నీ నిర్ణయాన్ని అందరిమీద రుద్దుతున్నావ్ అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు.తులసి ఏమన్నా చేస్తుంది అని భయపడుతున్నారా అని లాస్య అంటుంది అప్పుడు నందు అలా చేసేదే అయితే బిజినెస్ కి డబ్బులు తీసుకున్నప్పుడే ఏదైనా చేసేది అని అంటాడు ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఫైనల్ రౌండ్ మొదలవుతుంది. ప్రేమ్ రంజిత్ ఇద్దరూ చాలా బాగా పాట పాడుతారు ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో విన్నర్ ఎవరు అనేది తెలుస్తుంది.