Zodiac Signs : ఆగస్టు నెలలో 2022లో తులా రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం… మేషరాశిలో కుజుడు, రాహు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి ,11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడో తేదీ నుండి కర్కాటకంలోకి వస్తారు. అదేవిధంగా కర్కాటకంలో ఉ న్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉంటారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహరాశిలో ఉండి తర్వాత కన్య రాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోని కేతువు మకరంలో వక్రమించిన అటువంటి శని మీనరాశిలోని ఒక్కరించినటువంటి గురువు ఉన్నారు.
ఈ తులా రాశి వారికి: ఈ రాశులు కేతు యొక్క సంచాలకు జరుగుతుంది. కాబట్టి చిన్నపాటి వైరాగ్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని, ఉద్యోగంలో స్కిల్స్ ని పెంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో అలాగే మీ భాగస్వామితో అలాగే విదేశాలకు వెళ్లే విషయాలలో కొంత ఒత్తిడి ను కలిగిస్తాయి. అయితే ఇవి 11వ తేదీ నుండి తగ్గే అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు ఇప్పుడు క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్య ,గృహము, పంట పొలాలు, మాతృమూర్తి ఆరోగ్యం విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే…
Zodiac Signs : తులా రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అదేవిధంగా స్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

నవగ్రహాలలో శని భగవానుడికి అలాగే కేతు దగ్గర దీపారాధన చేయాలి. అలాగే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలను పఠించాలి. ఇలా చేయడం వలన ఈ గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విషయాలలో, అలాగే ప్రేమ వ్యవహారాలలో, సినిమా ఫీల్డ్ కు సంబంధించిన వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ విషయాలలో తీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి.
అలాగే రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి రావాల్సిన ధనం వస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి అనుకూలత కనిపిస్తుంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అన్ని విధాల మంచిని పొందాలి అంటే.. ఈ తులా రాశి వారు చేయవలసిన దేవతారాధన: శ్రీ వెంకటేశ్వర ఆరాధన, శని, కేతువు అలాగే రాహువు, కుజుడు దగ్గర దీపారాధన చేయండి. అన్ని అద్భుతాలే జరుగుతాయి.