Zodiac Signs : సింహ రాశి వారికి జూలై నెల 2022 గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే..

Zodiac Signs :జులై నెల 2022 సింహ రాశి వారి కి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం… ఈ నెలలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభంలో బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. కలిసి ఉండి రెండో తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటారు. ఇలా చేరుకున్న తర్వాత 17వ తేదీ వరకు అక్కడే ఉండి తరువాత బుధుడు, రవి కలిసి కర్కాటకంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు, మకర రాశిలో ఉండాల్సిన శని ఉండకుండా కుంభంలోనికి వచ్చి అక్కడ నుంచి మళ్లీ మకరంలోకి వస్తాడు. అదేవిధంగా మీనంలో గురువు యొక్క సంచాలకు జరుగుతుంది.

సింహ రాశి వారికి ఎప్పటినుంచో చేసే ప్రయత్నాలు ఇప్పుడు అనుకూలిస్తాయి. రుణాల విషయంలో మంచి అనుకూలత పొందుతారు అలాగే భూములు కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. విద్యకు సంబంధించిన విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సింహరాశిలో ముఖ, పుబ్బ ,ఉత్తర ,నక్షత్రాలు ఉంటాయి. ముఖ నక్షత్రం వారికి చిన్నచిన్న ప్రయాణాలు ఎక్కువ వుతాయి. అలాగే కొన్ని సంతకాలు చేసేటువంటివి వాటిలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి.పుబ్బ నక్షత్రం వారికి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు ఒకటో తేదీ నుండి 12వ తేదీ వరకు బాగా కనిపిస్తున్నాయి.

Zodiac Signs : సింహ రాశి వారికి జూలై నెల 2022 గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే..

horoscope July 2022 Zodiac Signs for Leo
horoscope July 2022 Zodiac Signs for Leo

వ్యాపార సంబంధించిన విషయాలలో మంచి విజయాలను అందుకుంటారు. ఉత్తర నక్షత్రం వారు వ్యాపార సంబంధించిన విషయాల్లో 17 వరకు బావుంది. 17 తర్వాత విదేశాలు వెళ్లాలి అనుకునే వారికి పెద్దగా అనుకూలత కనిపించడం లేదు, కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం వారు గణపతి యొక్క ఆరాధన చేయడం వలన వ్యాపారులలో విదేశాలకు వెళ్లి విషయంలో మంచి విజయాలను పొందుతారు. అన్ని విషయాల్లో చక్కటి ఫలితాలను పొందాలంటే ఈ సింహ రాశి వారు చేయవలసిన దేవతారాధన, దక్షిణ మూర్తి స్తోత్రం పఠనం చేయాలి. అలాగే గోవులకు క్యారెట్లు, అరటి పండ్లు తినిపించాలి. ఇలా చేయడం వల్ల అన్ని విషయాలలో చక్కటి ఫలితాలను పొందుతారు.