Vastu tips : మహిళలు రోజంతా ఇంటిని శుభ్రంగా ఉంచుతారు. అందులోనే వంటగదిని మరియు పూజగదిని మరింత శుభ్రంగా ఉంచుతారు. ఇటువంటి దుమ్ము ,ధూళి ఇంట్లోకి రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారు. ఈ రెండు ప్రదేశాలను మిగిలిన ఎందుకంటే ఎక్కువ శుభ్రంగా పెడతారు. ఎందుకంటే. ఇంట్లోనే ఈ రెండు ప్రదేశాలు లక్ష్మీదేవి నిలయంగా భావిస్తారు. లక్ష్మీదేవి సంతోషం పెట్టడం వల్ల దేవతలు కూడా ఇక్కడ నివసిస్తారని భావిస్తారు. అయితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం మరొకటి కూడా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని కూడా ఎంతో సిద్ధం చేసుకోవడం అవసరం. అదేంటో తెలుసా…?. వంటగది, పూజ గది కాకుండా దేవతలు, పూర్వీకులు ఇంట్లోకి ప్రవేశించే మరొక ప్రదేశం ఏంటో తెలుసుకుందాం.
ఇంటి ప్రధాన ద్వారం కూడా దేవతలు మరియు పూర్వికులు రాకకు అంతే ముఖ్యమైనది. ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి. దేవతలు ప్రధాన ద్వారం ద్వారా మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తారు. కొందరు తమ ఇంటి మెయిన్ డోర్ వైపుకి నేరుగా నెయ్యి దీపం వెలిగించడానికి ఇదే కారణం అంటున్నారు నిపుణులు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాన ద్వారా శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రధాన ద్వారం మురికిగా ఉంచిన.. దేవతలు ఇంట్లోకి ప్రవేశించి బయట నుంచి తిరిగి వెళ్ళిపోతారని నమ్మకం.ఇంటి ప్రధాన ద్వారా అని సంతోషానికి చిహ్నంగా భావిస్తారు భక్తులు. ఇక్కడ నుండి ఇంట్లో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి మెయిన్ డోర్ సరిగా లేకుంటే ఇంట్లో సంతోషం ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం శుభప్రదంగా, పరిపూర్ణంగా ఉంచడానికి, కొన్ని వస్తువులను ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ వస్తువులను సరైన పరిస్థితిలో ఉంచడం చాలా ముఖ్యం.
Vastu tips : మీ ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా…

ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలశం ఏర్పాటు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఆ ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించలేదు. అంతేకాకుండా మెయిన్ డోర్ కి ఎల్లప్పుడూ మామిడి ఆకుల తోరణం కట్టి ఉంచితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా స్వస్తిక్ చేయడం వల్ల ఇంటి వాస్తు, దిశా దోషాలు తొలగిపోతాయి. ప్రధాన ద్వారం మధ్యలో నీలిరంగు స్వస్తికాన్ని ఉంచడం వల్ల ఇంట్లోనే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకుని రావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచుతారు