Guppedantha Manasu 16 October 2022 Episode : రిషి ని మర్చిపో అని వసుకి కి చెప్తున్న జగతి… రిషి సార్ ని నేను మారుస్తా అంటున్న వసుధార…

Guppedantha Manasu 16 October 2022 Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు… సోమవారం ఎపిసోడ్ 584 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వసుదారని చీర కట్టుకు రమ్మని రిసి ఇచ్చిన చీరని ధరణికి ఇచ్చి తనని కట్టుకునేలా చేసి తనని కిందికి తీసుకొని వస్తుంది. అప్పుడు చీర ధరణి కట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక దేవయాని ధరణి తిడుతూ ఉంటుంది. జగతి మాత్రం తిడుతూ ఉండగా రిషి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తారు మనం దానికి అడ్డుపడవద్దు అని బొమ్మల కొలువు పూజ కంప్లీట్ చేయండి అంటూ మన కుటుంబంలో కలిసి నడవాలని తనకు లేదు మనం దానికి ఏం చేద్దాం కానివ్వండి అని చెప్తాడు. తర్వాత ధరణి పూజ ముగిస్తుంది. ఇక రిషి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జగతి కూడా కోపంగా వెళుతూ నా రూమ్ కి ఒకసారి రా నీతో మాట్లాడాలి అని వసుకి చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత జగతి రూమ్ కి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. అంతలో మహేంద్ర వెళ్లి జగతి ఆవేశం తగ్గించుకో అని చెబుతూ ఉంటాడు.

అందులో వసుధార అక్కడికి వెళ్లి మేడం అని మాట్లాడుతూ ఉండగా.. నువ్వు ఈ ఇంటికి ఇక రాకు ఇక రిషి ని మర్చిపో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు వసుధార మేడం నేను ఇదంతా మీకోసమే చేస్తున్నాను అని గురుదక్షిణ గురించి మాట్లాడుతూ ఉండగా.. జగతి ఒక్కసారిగా వసుధార చెంప పగలగొట్టి ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా చూస్తున్న రిషి వచ్చి జగతి పై మండిపడుతూ.. వసుధర మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవయానికి కూడా నువ్వేం చేస్తున్నావ్ జగతి ఒక ఆడపిల్లని అలా కొట్టవచ్చు అని అడుగుతుంది. అప్పుడు వసుదారా నన్ను కొట్టే హక్కు మేడంకు మాత్రమే ఉంది అని చెప్తుంది. వసుదారా ఈ ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అని అంటూ ఉండగా జగతి ఆపు వసుదారా అని అనగానే… అప్పుడు రిషి మేడం ఇక చాలు తన బాధపడితే నేను చూడలేను తనని నా ముందే కొట్టారు. ఆ బాధ ఏంటో మీకు తెలుసా అయినా మీకు ఎలా తెలుస్తుంది లేండి చిన్నప్పుడే నన్ను కష్టాల్లో వదిలి వెళ్ళిపోయారు అని తను బాధపడేలా మాట్లాడుతూ రా..వసుధార అని తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu 16 October 2022 Episode : రిషి ని మర్చిపో అని వసుకి కి చెప్తున్న జగతి…

Guppedantha Manasu 16 October 2022 Episode
Guppedantha Manasu 16 October 2022 Episode

తర్వాత తనని కారులో తీసుకెళ్తూ ఎందుకు వసుధర ఇలా చేస్తున్నావ్ మొండిగా బిహేవ్ చేస్తున్నావ్.. మన ప్రేమకి ఈ అడ్డంకి ఎందుకు నేను ఎంతో ఇష్టపడి ఆ చీర ఇస్తే కట్టుకోకుండా అందరి ముందు నన్ను బ్లెమ్ చేశావు అయినా సరే తట్టుకొని ఓపిక పట్టుకున్నాను కానీ మళ్ళీ ఆ గురుదక్షిణ విషయమే మాట్లాడుతున్నావు నాకంటే ఆ జగతి మేడమే ఎక్కువ ఏంటి ఇలా చేస్తున్నావ్ నువ్వు లేకుండా నేను ఉండలేను వసుదార అని బాధపడుతూ అంటూ ఉంటాడు. అప్పుడు వసుధార అసలు మీరు ఏం జరిగిందో ఫస్ట్ తెలుసుకోండి రిషి సార్ అసలు మేడం అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఒక తల్లి బిడ్డని ఎందుకు వదిలేసి పోతుంది మీరు ఒక్కసారైనా ఆలోచించారా.. అసలు దీని వెనక కారణమేంటి తెలుసుకున్నార.. అని రిషికి జ్ఞానోదయం అయ్యేలా చెప్తూ ఉంటుంది. కానీ రిషి ప్లీజ్ వసుధార ఇక ఈ టాపిక్ నా దగ్గర ఎత్తకు అంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…