Astrology : మన ఇంట్లో ప్రతి వస్తువులను వాస్తు శాస్త్రం ప్రకారం అమర్చుకుంటే ఊహించని విధంగా డబ్బు లభిస్తుందట. ఇటువంటి వస్తువులను ఇంటి బాల్కనీలో ఉంచినట్లయితే ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడి దీంతో ఆర్థిక కరమైన సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని అంటున్నారు నిపుణులు.ప్రతి ఒక్కరూ ఇంట్లో సానుకూల శక్తిని గాని జీవితంలో శ్రేయస్సుని పొందాలనుకున్నా కానీ వాస్తు శాస్త్రంలో కొన్ని అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇటువంటి వస్తువులను సరైన దిశలో లేదా సరైన స్థలంలో ఉంచడం ఉత్తమం. తులసి మొక్కను మన హిందువులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో పెంచుతారు.
అంతేకాకుండా తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట అందుకే ఇంటి బాల్కనీలో తులసి మొక్కను తూర్పు దిశలో నాటుకోవాలి. దీంతో ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ఆ తులసి మొక్క ఇంట్లో పెరిగేకొద్దీ డబ్బు కొరత తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది. కుబేరుడు ఎప్పుడూ కూడా ఉత్తర దిశలో కొలువై ఉంటాడట. కావున మనీ ప్లాంట్ ని ఇంటి బాల్కనీ ఉత్తర దిశలో ఉంచాలట. మనీ ప్లాంట్ ని ఇంట్లో పెంచడం ద్వారా ఊహించని విధంగా డబ్బు లభిస్తుంది. ఇంటి వెనక పరిసరాలలో నాటడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు.
Astrology : వాస్తు నియమం ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీకు ధన ప్రాప్తి కచ్చితంగా.

కొన్ని మతాల ప్రకారం రాగి లోహం సూర్యుడు అంగాక గ్రహానికి సంబంధించినది. కావున మీ గృహ సమీపంలో రాగి సూర్యుడు ప్రతిబింబాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఎంత తొలగిపోయి ధన సమస్యలు కూడా దూరమవుతాయి. లాఫింగ్ బుద్ధని చాలామంది ఇంట్లో కానీ వ్యాపారాలలో కానీ, ఆఫీసుల్లో కానీ ఇలా వివిధ పరిసర ప్రాంతాలలో లాఫింగ్ బుద్ధని పెట్టుకోవడం శుభంగా భావిస్తారు. కుటుంబ సభ్యుల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇంట్లో సంతోషం ,సంపద ఉంటుంది. టెన్షన్స్ లో ఉన్నవారు దీనిని చూస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.