Samantha – Naga Chaitanya : నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని కూడా చాలా రోజులు గడిచిపోయాయి. వాళ్లు విడాకులు తీసుకోవడం.. ఎవరి జీవితాలను వాళ్లు బతికేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం సినిమాలతో ఇద్దరూ బిజీ అయిపోయారు. అసలు.. తమకు పెళ్లయిందని.. ఆ తర్వాత విడాకులు అయ్యాయని కూడా మరిచిపోయినట్టున్నారు. అసలు ఏమాత్రం తమ విడాకుల గురించి పట్టించుకోకుండా ఇద్దరూ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

అయితే.. సమంత, చైతూ విడాకులపై ఇటు సమంత తల్లిదండ్రులు కానీ.. అటు చైతూ తల్లిదండ్రులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. తమ విడాకులపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ.. తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మాత్రం తన కూతురు విడాకులపై స్పందించాడు. ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లోనే చదువుదాం రండి.
Samantha – Naga Chaitanya : నా మైండ్ బ్లాంక్ అయిపోయింది
సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడిపోయారని తెలిసినప్పుడు నా మైండ్ మాత్రం బ్లాంక్ అయిపోయింది. కాకపోతే త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని అనుకుంటున్నా. కానీ.. ఇద్దరూ తీసుకున్న ఈ కీలక నిర్ణయం మాత్రం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు చైతన్య అంటే చాలా ఇష్టం. మా కుటుంబం చైతూతో చాలా సరదాగా గడిపింది. చైతూతో గడిపిన క్షణాలను మేము ఎప్పటికీ మరిచిపోం. వాళ్లిద్దరూ విడిపోయినప్పటికీ… తమ జీవితాల్లో మాత్రం వాళ్లు ముందు సాగాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. అంటూ జోసెఫ్ ప్రభు ఈ పోస్ట్ చేసి వాళ్లిద్దరి పెళ్లి నాటి ఫోటోలను షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. మీరు పెళ్లి చేసుకొని విడిపోయినా.. స్నేహితుల్లా కలిసి ఉండండి.. అని సమంత తండ్రి పోస్ట్ లో చెప్పాడా.. చైతన్యను సమంత ఫ్యామిలీ అంతగా ఇష్టపడినప్పుడు ఎందుకు సామ్.. విడాకులు ఇచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.