Karthika Masam : కార్తీక మాసంలో ఇలా చేస్తే కుబేరులు అవ్వడం ఖాయం…

Karthika Masam : ప్రతి మనిషికి బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరి ముఖ్యంగా మహిళలకు. అందుకే వాటిని శుభకార్యాలకు అలంకరించుకుని ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. మరి కొందరు మాత్రం ఇంట్లో పరిస్థితుల వలన బంగారాన్ని తాకట్టులో ఉంచాల్సి వస్తుంది. కొందరు తాకట్టులో పెట్టిన బంగారాన్ని వెంటనే తెచ్చుకున్నప్పటికీ మరికొందరు వెంటనే తెచ్చుకోలేరు. అయితే ఇలా తాకట్టులో ఉన్న బంగారం బయటకు రాడానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన పరిష్కమార్గాలు పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

if-you-do-this-in-the-month-of-kartika-you-are-sure-to-become-kuberas

Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని కొన్ని నియమాలను ఆచారాలను అందరూ నమ్ముతుంటారు. అదేవిధంగా తాకట్టులో ఉన్న బంగారం త్వరగా విడిపించుకోవాలంటే మీకు వీలుగా ఉన్నప్పుడు ఆదివారం రోజు పెసరంత బంగారం పుట్టలో వేసి పుట్టకు పూజ చేయాలట. ఎక్కువ ఏం అవసరం లేదు పెసరంత వేస్తే చాలు. పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలతో పూజ చేసి పెసరంత బంగారాన్ని వేస్తే తాకట్టులో ఉన్న బంగారం త్వరగా విడిపించుకోవచ్చని విశ్వాసిస్తున్నారు. అలాగే ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ముఖ్యమైన సమస్యలు రుణ బాధలు.

if-you-do-this-in-the-month-of-kartika-you-are-sure-to-become-kuberas

ఇక ఈ రుణ బాధల సమస్యలతో బాధపడేవారు మంగళవారం రోజు ఒక పరిహారం చేయడం వలన సమస్యలు తొలగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు 27 మందార ఆకులను తీసుకుని గణేశ విగ్రహానికి ఓం గణేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ మందారాకులను సమర్పించాలి. ఇలా తొమ్మిది మంగళవారాలు పూజలు నిర్వహించాలి. పూజ పూర్తయిన తర్వాత మందార ఆకులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా చేయడం వలన అప్పుల సమస్యల నుండి సులభంగా బయటపడతారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. యువతరం దీనిని ధ్రువీకరించలేదు.

Advertisement