Heroine Morphing Videos : ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు మరియు హీరోయిన్స్ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొదట రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సినీ ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాని కూడా షేక్ చేసింది. ఇక ఈ ఫేక్ వీడియో పై అమితాబచ్చన్ నుండి విజయ్ దేవరకొండ వరకు చాలామంది హీరోలు స్పందించారు. ఇలాంటి వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. అయితే నిజానికి ఇలా జరగటం ఇదే మొదటిసారి అంటే తప్పని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల క్రితం నుండే…ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ డీప్ వీడియో గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
కానీ కొన్నేల క్రితమే కాజోల్ కు సంబంధించిన ఫేక్ వీడియోలు ఫోటోలు చాలానే ఉన్నాయి. ఒక కాజోల్ వీడియో మాత్రమే కాదు కత్రినా కైఫ్ ,మనీషా కొయిరాలా , ఊర్మిళ , కరీనాకపూర్ ,కరిష్మా కపూర్ వంటి బాలీవుడ్ హీరోయిన్స్ అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి అనుష్క శెట్టి , సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ,మంచు లక్ష్మి , త్రిష , రోజా వంటి హీరోయిన్ల కు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా దర్శనమిచ్చాయి. అయితే అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం పెద్దగా లేకపోవడం వలన ఇలాంటి వీడియోలు ఎవరు ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇలాంటి వీడియోలను పట్టించుకోకుండా ఉండడం ఉత్తమం అని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎవడో ఒకడు దేశానలుములల నుండి రీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వీడియోలకు ఆర్జీవి వంటి మేధావులు చెప్పే లాజిక్ ఒకటే.
ఇలాంటి వీడియోలు వలన సెలబ్రిటీల పాపులారిటీ బాగా పెరుగుతుంది. దానికోసం పనులు ఆపుకొని ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అంటూ ప్రస్తావిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇలాంటి వీడియోలు గాని ఫోటోలు గాని బయటికి వస్తే జనాలు గూగుల్ సెర్చ్ వలన ఇంకాస్త పాపులారిటీ పెరుగుతుంది. ఇక సామాన్యులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేదు. ఎందుకంటే జనాలు ఎక్కువగా సినీ సెలెబ్రెటీల విషయాలను చూస్తారు కానీ సామాన్యుల గురించి పెద్దగా పట్టించుకోరు. కాబట్టి సామాన్యులకు ఇలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువ. ఇంకా ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసేవారు కేవలం సోషల్ మీడియాలో సెలబ్రిటీ లెవెల్ లో ఉన్న వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అవే వారికి పాపులర్ కి తెచ్చి పెడతాయి. కాబట్టి ఈ లాజిక్ అందరూ ఆలోచిస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.