Lalitha Jewellery Owner Kiran Kumar : శ్రీవారికి 108 బంగారు పుష్పాలను విరాళంగా ఇచ్చిన లలిత జ్యువెలరీ ఎండీ …

Lalitha Jewellery Owner Kiran Kumar : లలిత జ్యువెలరీ ఎండీ కిరణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగారు నగల వ్యాపార సంస్థలను ప్రారంభించి వ్యాపార రంగంలో ఎంతో దూసుకుపోతున్నారు. ఇలా తమ నగల వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయడం తన లక్ష్యం అంటూ ఆయన పలు సందర్భాలలో తెలియజేశారు. ఇప్పటివరకు 51 షోరూంలను ప్రారంభించినటువంటి కిరణ్ కుమార్ వ్యాపారాన్ని మరింత ముందుకు నడిపించడమే తన లక్ష్యం అని తెలిపారు. ఇకపోతే వ్యాపారాన్ని విస్తరింపచేయాలంటే ఎంతోమంది సెలబ్రిటీలకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు.

Advertisement

lalitha-jewellery-owner-kiran-kumar-gifted-gold-flowers-to-ttd-temple

Advertisement

కానీ కిరణ్ కుమార్ సొంతంగా వ్యాపార ప్రచారాన్ని ఆయనే కొనసాగిస్తున్నారు. డబ్బులు ఊరికే రావు అంటూ ఒక్క డైలాగ్ తో ఈయన చాలా ఫేమస్ అయ్యారు. సొంతంగా వ్యాపారంలో ముందుకి కొనసాగుతున్నటువంటి కిరణ్ కుమార్ తాజాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఏకంగా 108 బంగారు పుష్పాలను విరాళంగా ఇచ్చారు. కడప కు చెందిన రాజారెడ్డి అనే డాక్టర్ స్వామివారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ పుష్పాలను లలిత జ్యువెలరీ ఆధ్వర్యంలో తయారు చేయించి స్వామివారికి విరాళంగా ప్రకటించారు.

lalitha-jewellery-owner-kiran-kumar-gifted-gold-flowers-to-ttd-temple

ఈ క్రమంలోనే బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి కిరణ్ కుమార్ స్వామివారి కి 108 బంగారు పుష్పాలను విరాళంగా అందించారు. ఇలా స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కడపకు చెందిన డాక్టర్ తమకు విరాళం ఇచ్చారు. అయితే దానితో మేము స్వామివారికి ఆరు నెలలపాటు ప్రత్యేకంగా పుష్పాలను తయారు చేయడం కోసం సమయం కేటాయించి ఎంతో అద్భుతంగా పుష్పాలను తయారుచేసి స్వామివారి కే విరాళంగా ఇచ్చామని ప్రకటించారు. ఇక ఆలయ ప్రాంగణంలో కూడా తన ఫేమస్ డైలాగ్ డబ్బులు ఊరికే రావు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement