Marriage Loan : పెళ్లి చేసుకుంటే రూ.25 లక్షల లోన్…వెంటనే అప్లై చేసుకోండి…

Marriage Loan  : ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నామంటే లోన్ ఇస్తారు…పంట పండిస్తున్నాం అంటే రుణం ఇస్తారు…కానీ పెళ్లి చేసుకుంటే కూడా లోన్ ఇస్తారు అంటే నమ్ముతారా.అవును ఇది నిజమే…పెళ్లి చేసుకోవడానికి అయ్యే ఖర్చును రుణం రూపంలో ఇచ్చి EMI ద్వారా స్వీకరిస్తారు. అంతేకాకుండా మినిమం టెన్యూర్ అయితే 0 వడ్డీ , కాస్త ఎక్కువైతే 1% వడ్డీని మాత్రమే విధిస్తారు. ఇక దీనికి పలానా వారు మాత్రమే అర్హులనే నిబంధన ఏమీ లేదు.ఎవరైనా సరే దీనిని తీసుకోవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి….

Advertisement

rs-25-lakh-loan-if-you-get-married-apply-immediately

Advertisement

 

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. జీవితంలో ఈ రెండు కార్యక్రమాలను ఎలాంటి అప్పు లేకుండా చేసిన వారిని చాలా గొప్పోడు అంటారు. ఎందుకంటే ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుంది. ఇంకా హై లెవెల్లో చేసుకోవాలనుకుంటే కనీసం కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ పెళ్లి కార్యక్రమాన్ని మధ్యతరగతి వారు కూడా చాలా వైభవంగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అప్పులు చేసి మరి పెళ్లి ని గ్రాండ్ గా చేసి పదిమందిలో గొప్ప గా ఉండాలి అనుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో పెళ్లి అకస్మాత్తుగా నిశ్చయమవుతుంది. ఇక ఈ సమయంలో లక్షల కొద్ది డబ్బులు ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు. ముఖ్యంగా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకోవాలనుకునే మధ్యతరగతి వ్యక్తికి సరిపడా నగదు చేతిలో ఉండదు.

rs-25-lakh-loan-if-you-get-married-apply-immediately

ఇక పెళ్లి చేసుకుంటున్నానని రుణం ఇవ్వమని బ్యాంకుకు వెళ్లి అడిగితే అస్సలు ఇవ్వరు. అలాగే తెలిసిన వాళ్ళు ఇచ్చే పరిస్థితి ప్రస్తుత కాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. ఈ క్రమంలో కొన్ని హోటల్స్ లో పెళ్లి చేసుకోనే వారికి యాజమాన్యం లోన్స్ సౌకర్యం కల్పిస్తుంది. మీరు స్టార్ హోటల్లో గొప్పగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లికి అయిన ఖర్చును ఒకేసారి కాకుండా లోన్ రూపంలో చెల్లించుకోవచ్చు. ఇక ఈ మొత్తాన్ని ఆరు నెలలో చెల్లిస్తే ఎలాంటి వడ్డీ విధించరు. 1 ఇయర్ పెట్టుకుంటే 1% వడ్డీ విధిస్తారు. దీనినే ప్రస్తుతం MNPL అంటే Marrie now pay later అని అంటున్నారు .అంటే ముందు పెళ్లి చేసుకొని తర్వాత డబ్బులు చెల్లించండి అని అర్థం. రాడిసన్ బ్లూ అనే హోటల్ వారు పెళ్లి అని చెప్పగానే ప్రస్తుతం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.

Advertisement