Vastu Tips : ఈ రోజుల్లో చాలామంది డబ్బు సమస్యలతో సతమతమవుతున్నారు. ఎంత కష్టపడినా డబ్బు చేతికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో ధన ప్రాప్తి కచ్చితంగా జరుగుతుంది. మనం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను నాటుతాము కానీ కొన్ని రకాల మొక్కల వల్ల ఇంట్లో దోషాలు తొలగిపోతాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి మొక్కను ఇంటి లోపల బయట నాటడం సాధ్యం కాదు. ఎందుకంటే… చెట్లు కూడా మనిషి జీవితంలో సానుకూల, ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు సానుకూల శక్తినిచ్చే మొక్కలను నాటడం పై దృష్టి పెట్టరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రకాల మొక్కలను ఇంట్లో నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
ఈ మొక్కల్లో లక్ష్మణ మొక్క ఒకటి. దీనిని ఇంట్లో నాటినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుంది అంటున్నారు. ఇది తీగల కనిపించే మొక్క. దీని ఆకులు, తమలపాకులు, పీపుల్ లాగా కనిపిస్తాయి. లక్ష్మణ మొక్కనే ఇంటికి ఈశాన్యం మూలలో పెట్టుకోవడం మంచిది అంటున్నారు వాస్తు నిపుణులు. ఈ దిక్కు కుబేరునికి చెందినది. ఈ దిశలో మొక్కను నాటడం ద్వారా డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఇది కాకుండా, ఈ మొక్కని ఇంటికి తూర్పు దిశలో కూడా నాటవచ్చు. పెద్ద కుండీలో నాటడం ద్వారా బాల్కనీలో కూడా ఉంచవచ్చు. ఈ మొక్క యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Vastu Tips : ఈ మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం.. ఇది మీ నివాసంలో ఉంటే ధన ప్రాప్తి కచ్చితంగా.

ఈ మొక్కకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన పాత్ర ఉంది. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు. దీనిని సరి అయిన దిశలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మాత్రమే పెరుగుతాయి. అదే సమయంలో ఇంట్లో డబ్బు ప్రవాహం కూడా అధికమవుతుంది. మహాలక్ష్మికి ఇష్టమైన మొక్క లక్ష్మణ మొక్క కూడా ఒకటి అని చెప్పవచ్చు. దీనిని ఇంట్లో పెట్టుకోవడం లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది. అంతేకాదు ఇంట్లో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. నిలుపు నిలిచిపోయిన పనులు సక్రమంగా జరగడం ప్రారంభిస్తాయి. అనుకున్న పనులు కచ్చితంగా నెరవేరుతాయి అంతేకాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది.