Guppedantha Manasu 12 October 2022 Episode : చిన్నితరపై ప్రసారమయ్యే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ ప్రేక్షకులని అంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 579 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… రిషి జగతితో మీరు రాకముందు డాడ్ ఒంటరిగా ఉన్నాడు మీరు వచ్చాక ఆనందంగా ఉన్నాడు డాడ్ ని ఆనందంగా ఉంచే బాధ్యత మీది మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి డాడీని ఆనందంగా ఉంచండి అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలో మహేంద్ర జగతి దగ్గరికి వచ్చి బాధపడుతున్నావా జగతి అనగానే నువ్వు కొన్ని మాటలు విన్నావు మహేంద్ర గుచ్చుకుంటున్నాయి. తనలో బాధంతా నాకు చెప్పాడు కాబట్టి మనం తనని బాధ పెట్టొద్దు తనని సంతోషంగా ఉంచాలి అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే వసుధార రిషి గురించి ఆలోచించుకుంటూ తనకి గిఫ్ట్ ఇవ్వడానికి వస్తూ ఉండగా రిషి వసుకి థాంక్స్ అని మెసేజ్ పెడతాడు.
అప్పుడు రిషి దగ్గరికి వస్తూ చూసుకోకుండా రిషి వాసు తలలు కొట్టుకుంటాయి. అప్పుడు మళ్లీ రిసి తలని కొట్టి మనం ఎలా కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయి సార్ అని చెప్తూ ఉంటుంది. అలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా దేవియాని అక్కడికి వస్తుంది దేవియని చూసి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని వసుని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుండగా తనకేటకారంగా సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మహేంద్ర తో జగతి రిషి కోసం మనం పది అడుగులు ముందుకు వేయాలి తనకి నచ్చినవి చేయాలి అంటుండగా… మహేంద్ర నాకు ఏం చేయాలో తెలుసు జగతి కానీ ఈ విషయాలను ఇక్కడ ఇంట్లో మాట్లాడవద్దు అని చెప్పగానే అంతలో అక్కడికి గౌతం వాసు వస్తారు. ఇక వసు వచ్చి మేడం ఎలా ఉంది అనగానే శరీరం బాగానే ఉంది కానీ మనసే బాగాలేదు అనగానే మహేంద్ర ఇప్పుడే చెప్పాను కదా ఈ విషయాలు ఇంట్లో మాట్లాడొద్దని అని అంటాడు.
Guppedantha Manasu 12 October 2022 Episode : వసుధారకి బుగ్గన చుక్క పెడుతున్న రిషి…
ఇక వాసు మేడంకి ఇష్టమైంది చేయబోతున్నాను సార్ అనగానే.. మనకి వదిన పర్మిషన్ దొరుకుతుందా అని మహేంద్ర అంటారు. అప్పుడు తీసేసారు ఉన్నాడు కదా అని వసుధారా రిషి దగ్గరికి వెళుతుంది. రిషి నేను గురుదక్షిణ గురించి కాకుండా మేడం డాడి గురించి కూడా ఆలోచించాలి అనుకుంటూ ఉంటాడు. అంతలో వసుధార రిషి దగ్గరికి వెళ్లి తనకి బొమ్మల్ని గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ బొమ్మల్ని చూసిన రిషి సంతోషంతో కొద్దిసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. తర్వాత వసుధార మేడంకి బొమ్మల కొలువంటే చాలా ఇష్టం దానిని ఇంట్లో జరుపుకోవడానికి మీ పర్మిషన్ కావాలి సార్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు రిషి నేను కూడా అలాంటి వాటికి దూరమయ్యాను సరే అని చెప్తాడు. అప్పుడు వాసు సంతోష్ పడుతూ ఉంటుంది. ఇక ఆ బొమ్మల్ని రిషి చూస్తూ ఈ బొమ్మకి ఏదో తక్కువయ్యింది అని ఆ బొమ్మల్ని అక్కడ పెట్టి. వసు కంటి కాటుకను తీసుకొని ఆ బొమ్మకి పెడతాడు. అప్పుడు వాసు తనబుగ్గన దిష్టి చుక్క పెట్టినట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..