Vastu Tips : అరటి చెట్టు ఇంట్లో ఎక్కడ నాటాలి, ఎలా నాటాలి…. వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం

Vastu Tips : ప్రస్తుత కాలంలో ప్రజలు అరటి చెట్టుని పెంచుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో గౌరవప్రదమైన స్థానం ఉంది. ఈ చెట్టులో నారాయణుడు కొలువై ఉంటాడని నమ్మకం. బృహస్పతి వారం రోజున ఈ మొక్కకు పూజ చేస్తారు . అరటి చెట్టు ని పెంచడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. అయితే అరటి చెట్టు ని సరియైన విధంగా పెంచకపోతే అశుభం జరుగుతుంది. అరటి చెట్టుని సరైన విధంగా పెంచకపోయినా సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా చెడు ప్రభావం ఏర్పడుతుంది.

అందుకే చాలామంది ఇంట్లో నాటటానికి ఇష్టపడరు. కానీ జ్యోతిష్య శాస్త్ర నియమాల ద్వారా అరటి చెట్టును పెంచితే ఆ ఇంట్లో సిరి, సంపదలు కలుగుతాయి. అరటి చెట్టు ఏ దిక్కున పెంచితే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. అరటి చెట్టును ఈశాన్యం దిక్కున నాటితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే తూర్పు, ఉత్తర దిశలో అరటి చెట్టును నాటవచ్చు. ఈ చెట్టును ఇంటి ముందు నాటకూడదు. ఇంటి వెనక భాగంలో గార్డెన్ ఏరియాలో పెంచుకోవచ్చు. అరటి చెట్టు విష్ణు నివాసం గా భావిస్తారు.

Vastu Tips : అరటి చెట్టు ఇంట్లో ఎక్కడ నాటాలి, ఎలా నాటాలి

Vasthu tips Banana tree plantation
Vasthu tips Banana tree plantation

తులసిని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి అరటి చెట్టు దగ్గర తులసి మొక్కలను నాటితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే ప్రతి గురువారం అరటి చెట్టు కి పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే నారాయణుడు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అరటి మొక్కకు పరిశుభ్రమైన నీరును మాత్రమే పోయాలి. ఈ చెట్టు చుట్టూ పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేలా చూడాలి. పూజ అనంతరం తరువాత మిగిలిన పసుపు, కుంకుమ, పువ్వులు చెట్టుపైన విసరకొడదు. అరటి చెట్టు ఈశాన్యం దిక్కున ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి.