Vastu tips : హిందువులు పూజలో ఎంతో పవిత్రంగా భావించేది తులసి మొక్క. ఈ తులసి మొక్క వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసి మొక్క ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు, తులసి ఆకుల వలన ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఎటువంటి వ్యాధులు మనల్ని దరిచేరవు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే మనం ఎంతో అపురూపంగా చూసుకునే తులసి మొక్క ఒక్కోసారి ఎండిపోతుంది లేదా సహజ రంగును కోల్పోతుంది. ఒక్కోసారి ఆకులు కూడా రాలిపోతాయి. ఇలా తులసి మొక్కలో మార్పులు జరిగినప్పుడు ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక రకంగా తులసి మొక్కలో వచ్చే మార్పులు మనకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెబుతాయంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
తులసి మొక్క ఎల్లప్పుడూ పచ్చగా ఉంటే మన ఇంట్లో కుటుంబీకులు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. అలాగే మానసికంగాను, శారీరకంగాను ఎటువంటి సమస్యలు రావని అర్థం. తులసి చెట్టు పచ్చగా నిగనిగా వాడితే మన ఇల్లు కూడా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో కళకళలాడుతుంది. అదే ఒకవేళ తులసి చెట్టుకు నీళ్లు పోయకుండా ఉన్న అది పచ్చగా, ఇంకా ఎత్తుగా పెరిగితే ఇంట్లో వారికి త్వరలో అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారు సిరిసంపదలతో సుఖంగా జీవిస్తారు.
Vastu tips : మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోయిందా

ఒకవేళ పచ్చగా ఉన్న తులసి చెట్టు అకస్మాత్తుగా ఎండిపోతే ఆ ఇంటిలోని పెద్దవారికి ఆరోగ్యపరంగా ఏదో కీడు జరగబోతుంది అని అర్థం. ఏదో ఒక పెద్ద అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటుందని అర్థం. అదే ఒకవేళ తులసి ఆకులు అకస్మాత్తుగా వేరే రంగు కు మారితే ఇంట్లోని కుటుంబీకులు క్షుద్ర శక్తుల బారిన పడుతారని అర్థం. ఎవరైనా మిమ్మల్ని చూసి ఈర్షపడేవారు క్షుద్ర శక్తులు ఉపయోగించినప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయి. దీనిని బట్టి తులసి మొక్క భక్తితో పూజించడమే కాదు తులసి మొక్క ఎండిపోకుండా ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. తులసి చెట్టులో వచ్చే మార్పులనుగమనిస్తూ ఉండాలి.