Viral Video : కొన్ని వందల ఏళ్ల కిందనే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కలియుగం ఎప్పుడు అంతం అవుతుందో.. ఈ భూమ్మీద ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో.. బ్రహ్మం గారు కళ్లకు కట్టినట్టుగా తన కాలజ్ఞానంలో వివరించారు. అప్పుడు బ్రహ్మం గారు చెప్పిన విషయాలను ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ.. ఒక్కొక్కటిగా జరుగుతుంటే ఇప్పుడు అందరూ నోరెళ్లబెడుతున్నారు.

ఇంకొన్నేళ్లలో మంచినీళ్లను కొనుక్కొని తాగుతారు అని బ్రహ్మం గారు ఆనాడే చెప్పారు. దీంతో అప్పటి ప్రజలు.. ఎవరైనా మంచినీళ్లను కొనుక్కొని తాగుతారా అని పెక్కున నవ్వారు. కానీ.. నేడు మంచి నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి ఏర్పడింది. అలా బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి. ఎన్నో విచిత్రాలు జరుగుతాయి అని బ్రహ్మం గారు చెప్పారు. తాజాగా అటువంటి విచిత్రమే ఒకటి కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Viral Video : ఆవు దూడకు ఎంతో ప్రేమతో పాలు ఇస్తున్న కుక్క
కర్ణాటకలోని తుమకూరులో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నిజానికి ఈ ఘటన జరిగి కొన్ని నెలలు అవుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఆవు దూడకు ఓ వీధి కుక్క పాలు ఇవ్వడం చూసి అక్కడి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ప్రతి రోజు ఆ ఆవుదూడకు పాలు ఇవ్వడం కోసమే ఆ కుక్క.. దాని దగ్గరకు రావడం చూసి స్థానికులు నివ్వెరపోయారు.
వామ్మో.. బ్రహ్మం గారు చెప్పిన విషయాలు జరగకనే జరుగుతున్నాయి. ఇదేం విడ్డూరం బాబోయ్. ఆవుదూడ ఏంచక్కా ఏమాత్రం భయపడకుండా ఎలా కుక్క పాలు తాగుతోంది అంటూ స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంకా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(Video Courtesy : ETV Bharat Telangana)