Devotional news : మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభాలను ప్రార్థించి ఆ తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. ప్రదక్షిణలు చేస్తూ భక్తులు దేవాలయం వెనుక భాగాన్ని కూడా మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు, ప్రతి ఒక్క దేవాలయాల్లో ఈ పద్ధతిని భక్తులు అనుసరిస్తారు. అయితే ఇలా చేయడం వెనుక గల కారణాలు చాలామందికి తెలియదు.
పురాతన కాలం నుంచి మన పెద్దవారు గుడి చుట్టూ తిరుగుతూ అలా ప్రార్థిస్తారని మనం కూడా అలానే పాటిస్తున్నాం. కావున సాంప్రదాయాలు కొద్ది అలా ఆచరించి వెళ్లిపోతారు. ఇంకొంతమంది మంచి జరుగుతుంది అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. అంతేగాని దాని వెనుక ఉన్న రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. దేవాలయం వెనక భాగాన్ని మొక్కడం వెనుక బలమైన కారణం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Devotional news : భక్తులు దేవాలయం వెనుక భాగాన్ని కూడా ఎందుకు మొక్కుతారో తెలుసా…?

దేవాలయాల్లో మూల విరాటు ఉండే గర్భాలయం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. గర్భగుడిలో మూలవిరాట్ ని గోడల మధ్య కాకుండా వెనుక గోడకు దగ్గరగా ప్రతిష్ట చేస్తారు. ప్రతిరోజు దేవుడికి పూజలు చేయడం, మంత్రాలను చదవడం వలన భగవంతుడు పాదపీఠం కింద ఉన్న యంత్రం లోనికి మంత్ర శక్తి ప్రవేశిస్తుంది. దాని వలన దేవుని విగ్రహానికి ఒక ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ మంత్ర శక్తి వలన భగవంతుడు విగ్రహం నుంచి తపః కిరణాలు నాలుగు దిక్కులకు ప్రసరిస్తాయి. ఈ మంత్ర శక్తికి దగ్గరగా ఉండేది గర్భగుడిలో వెనుక వైపు గోడ. అందుకే గోడకు శిల్పాన్ని చెక్కి ఉంచుతారు. భక్తులు గుడి చుట్టూ తిరుగుతూ అక్కడ ఆగినప్పుడు తపఃశక్తిని పొందటానికి వీలు అవుతుంది.