Vastu Shastram : వంటగదిలో కొన్ని వస్తువులను అస్సలు ఉంచకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దాని వలన ఇంట్లో ప్రతికూలత ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇంట్లో బియ్యం లేదా పిండిని ఒక డబ్బాలో ఎప్పుడూ నింపుతూ ఉంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదు. ఖాళీ అయ్యే ముందు పిండి లేదా బియ్యాన్ని నింపాలి. అంతేకానీ దుమ్ము పట్టిన తర్వాత కాదు. ఒకవేళ ఇలా చేస్తే ఇంట్లో చెడు ప్రభావం ఏర్పడుతుంది. అలాగే వంటగదిలో ఉండే పసుపు గృహస్పతి గ్రహానికి చెందినది. వంటగదిలో పసుపు అయిపోతే అది గురు దోషం లాంటిది. దీనివలన ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుంది. అంతేకాదు భర్త తన జీవితంలో ఓడిపోవడం జరుగుతుంది. అందుకే వంట గదిలో పసుపు అయిపోకముందే పసుపు తెచ్చి పెట్టెలో నింపాలి. ఇంట్లో పసుపు లేకపోవడం సంపద లేకపోవడాన్ని సూచిస్తుంది.
అలాగే శుభకార్యాలకు ఆటంకం కలిగిస్తుంది. పసుపును ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదు. అలాగే ఎవరికీ కూడా ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అలాగే అన్నం ఎంత అవసరమో అంతవరకే వండుకోవాలి. మిగిలిన అన్నం లో క్రిములు చేరుతాయి కాబట్టి ఎప్పుడు ఇలా చేయకూడదు. అన్నం శుక్ర గ్రహానికి సంబంధించినది. కాబట్టి ఇంట్లో అన్నం ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. ఇంట్లో అన్నం కొరత ఉంటే భార్య భర్తల మధ్య వివాదాలు తలెత్తుతాయి. చాలామంది ఉప్పు అయిపోయిన తర్వాత తెచ్చుకుంటారు. అయితే ఇంట్లో ఉప్పు అయిపోవడం వలన రాహు ప్రభావం ఇంటి పై పడి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. వంటగదిలో ఉప్పు డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండదు.
అలాగే ఉప్పును ఇవ్వడం, తీసుకోవడం చేయకూడదు. ఇంట్లో ఆవ నూనె అయిపోకముందే తెచ్చుకోవాలి. ఆవనూనె శని గ్రహానికి సంబంధించినది. ఇంట్లో ఆవనూనె అయిపోతే శని దేవుడు ఆగ్రహిస్తాడు. వీలైతే ప్రతి శనివారం ఆవాల నూనెను దానం చేయాలి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో మందులు ఉంచకూడదు. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యులకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పొరపాటున కూడా వంట గదిలో మెడిసిన్ ఉంచకూడదు. కొంతమంది ఈ చపాతి పిండి కలిపాక మిగిలినది ఫ్రిజ్లో పెడుతుంటారు. ఇలా చేయడం వలన శని రాహు ఇంటి పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.