Gaanja Shankar – First High : గాంజా శంకర్ వచ్చేసాడు…సాయి ధరమ్ తేజ్ ఇంట్రడక్షన్ మామూలుగా లేదుగా..

Gaanja Shankar – First High : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అవ్వడం వలన గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అనంతరం దాని నుండి కోలుకున్న సుప్రీం హీరో విరూపాక్ష సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేసి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయి ధరంతేజ్ మరో రెండు సినిమాలను ఓకే చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ ఓ సినిమా తెరపైకి రాబోతుంది.

Advertisement

ganja-shankar-came-sai-dharam-tejs-introduction-was-not-usual

Advertisement

అయితే ఇటీవల సాయి ధరంతేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మూవీ టీం విడుదల చేసింది. అదే విధంగా సినిమాకు సంబంధించి చిన్న గ్లింప్స్ వీడియో కూడా వదిలింది. ఇక ఈ సినిమాకు ” గాంజా శంకర్ ” అనే పేరును ఖరారు చేస్తూ 1:40 సెకండ్ల నిడివి గల ఓ వీడియో క్లిప్స్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో సుప్రీం హీరో తేజ్ ఊర మాస్ లుక్ లో కనపడబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల విడుదలైన ఆ గ్లింప్సీ వీడియోని గమనించినట్లయితే ఓ తండ్రి తన కొడుకుకు కథ చెబుతున్న నేపథ్యంలో మొదలవుతుంది.

ఈ క్రమంలో కొడుకు లోకల్ హీరో కథ చెప్పు నాన్న అని అడగగా నీకు సుప్రీం హీరో కథ చెప్తా అని …ఆడు చిన్నప్పుడే చదువు బంద్ చేసిండు…అమ్మానాన్న చెబితే వినుడు లేదు..అడ్డమైన తిరుగులన్నీ తిరుగుతాడు..ఇక జార్ధాలు, సరదాలు ,గుట్కాలు, తాగుడు , మన్ను మశానం వాడికి లేని దరిద్రపు అలవాటు అంటూ లేదు…ఇలా మైండ్ బ్లోయింగ్ డైలాగ్స్ తో ఊర మాసు లెవెల్లో సాయి ధరంతేజ్ ఇంట్రడక్షన్ సాగింది. దీంతో ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Advertisement